Wednesday, October 16, 2013

ఒక నిశ్శబ్ద కథానాయిక


ఆనందం కోసం, సమయాన్ని ఖర్చుపెట్టదు. 
దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న 
ఇరుగు పొరుగు వారి సహాయార్ధం 
అప్పుడప్పుడూ బయటకు వస్తుంది. 
కృతజ్ఞతలకోసం ఎదురుచూడని సహాయం చేసేందుకు,
ఆమె ఒక మంచి స్నేహితురాలు!

మల్లి పూల పరిమళం లా ప్రేమను వెదజల్లుతున్న, 
ఎప్పుడూ నిజం న్యాయం కోసం ....
పెద్ద పీట వేస్తున్న ఉన్నత జీవనం ఆమెది. 
అవసరానికి, తిరిగి సహాయ పడలేదని .... బాధపడని, 
ఆమె .... ఒక నిశ్శబ్ద కథానాయిక .... ఆ కాలనీ లో, 
ఆమె తెల్లని మనసున్న ఒక మంచి వ్యక్తి! 

ఒంటరి జీవితాన్ని సాగిస్తుంది. 
ఆమె చుట్టూ మంచితనం వృత్తాన్ని కనిపిస్తుంది. 
నిగర్వి, మోసం తెలియని, కల్మషం యెరుగని 
ఒక అందమైన వ్యక్తిత్వం ఆమె .... 
పలుకరింపు లో, ఆ చిరునవ్వులో వెచ్చదనం ఉంది.
ఐదో పదిలో పడిన జీవితం ఆమె.

మౌనంగా ఆలకించి, సమయానికి ఆదుకుంటుంది. 
ప్రతి రోజూ అవసరం వున్న ఒక్కరికైనా సహాయపడాలని 
వయసు మీద పడ్డ ముసలి వాళ్ళను, 
తల్లీ, తండ్రీ తెలియని అనాదలను చేరదీస్తుంది. 
ఆమె .... ఒక అరుదైన గొప్ప వ్యక్తి! 
పదాలను పొదుపుగా వాడే ఒక నిశ్శబ్ద కథానాయిక, ఆమె 

ఆమె లక్ష్యం .... బ్రతికి వున్నన్నాళ్ళూ 
ఒక అందమైన ఆత్మలా, స్నేహ పరిమళం పంచే మహిళలా
పొగరు లేని, మోసం తెలియని, 
కల్మషంలేని ఒక ఉన్నత వ్యక్తిత్వం, శక్తి లా ....
ఒక మంచి వ్యక్తిలా, ప్రేమమూర్తిలా .... నివసించాలని 
ఆమె లాంటి స్నేహమయి ని .... వీధి వీధి లోనూ చూడాలని!?

2 comments:

  1. సర్, మీరు చెప్పిన కతానాయికను వీధి,వీధిలోనూ చూడాలంటే కుదరక పోవచ్చు,
    కానీ ప్రతి నాయకులను మాత్రం వీధికి నలుగురిని చూడొచ్చు.
    ఆమె లోని మంచిని మెచ్చుకొని, ఆమెకు సహకరించే వారు తక్కువ. ఎలాగైనా అపహాస్యం చేసి , ఆమె సేవను ఎగతాళి చేయటమే వారి లక్ష్యం.
    అందుకే అతి మంచితనం అసమర్దతగా కనిపిస్తుంటుంది.

    ReplyDelete
    Replies
    1. "మీరు చెప్పిన కథానాయికను వీధి, వీధిలోనూ చూడలేక పోవచ్చు, కానీ, ప్రతి నాయకులను మాత్రం వీధికి నలుగురిని చూడొచ్చు.
      ఒక మంచిని మెచ్చుకొని, సహకరించే వారు తక్కువ. అపహాస్యం చేసి, సేవను ఎగతాళి చేసే వారే ఎక్కువ. అది వారి లక్ష్యం. వారికి అతి మంచితనం అసమర్దతగా కనిపిస్తుంటుంది.
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! మీ అమూల్యమైన స్పందనకు. మీ స్పందన, మీ సూక్ష్మ విశ్లేషణ లో బాధను ఆవేదనను చదవగలుగుతున్నాను. మీ అక్షరాల్లో నిజం ఉండొచ్చు కానీ, .... నిశ్శబ్ద కథానాయిక మాత్రం అన్ని ఆటంకాలను దారులను తన గమ్యం చేరడానికి మాత్రమే ఉపయోగించుకుంది. ఉపయోగిస్తూనే ఉంది.

      Delete