అంధకారం అలుముకున్న
ఒక ఆలశ్యపు రాత్రి,
పేవుమెంట్ మీద
నడిచేందుకు అడ్డం గా,
సగం తీరని ఆకలి మంటల అన్నార్థుల,
నిద్రరాని ఆ నిట్టూర్పుల వెచ్చని గాలులు
అప్పుడప్పుడు
గురకలు గొణుగుడులై చెవుల్ని తాకుతూ
ఎందుకో ఒక్క క్షణం
తటపటాయించి ఆగబోయి,
మరు క్షణమే ఆగడం తప్పేమో అనిపించింది.
రాత్రిళ్ళు
అలా రహదారుల్లో
డ్రైనేజీ గొట్టాల పరిసరాల్లో
చెత్త కుండీల పక్కన నిదురించే శాపగ్రస్తులకు
దూరంగా ఉండాలని గుర్తుకొచ్చి
నా నడక లో
వేగం పెంచాను ఎందుకైనా మంచిదని,
రాత్రినీ, ఆగాలనిపించిన ఆలోచనను
పక్కకు మళ్ళించాలని
ప్రయత్నించిన
ఆ ఏడుపులాంటి శబ్దం
వినిపిస్తూనే ఉన్నా
నేనే తప్పేమో అనిపిస్తూనే ఉన్నా
నగరం నడిబొడ్డున అలా,
కాలి బాట పక్కన
షాపుల అరుగుల మీద
బస్ స్టాండుల్లో
విడిచేసిన చెప్పుల్లా ఎక్కడ బడితే అక్కడ
అసౌకర్యాల అంచుల పై
ఆవర్తనల గొడుగుకు దూరంగా
మానవత్వం ఆశ్రయం కోసం అలమటిస్తూ
నేనెక్కడ దోపిడీ కి గురౌతానోనని భయం నాలో ....
ఒక ఆలశ్యపు రాత్రి,
పేవుమెంట్ మీద
నడిచేందుకు అడ్డం గా,
సగం తీరని ఆకలి మంటల అన్నార్థుల,
నిద్రరాని ఆ నిట్టూర్పుల వెచ్చని గాలులు
అప్పుడప్పుడు
గురకలు గొణుగుడులై చెవుల్ని తాకుతూ
ఎందుకో ఒక్క క్షణం
తటపటాయించి ఆగబోయి,
మరు క్షణమే ఆగడం తప్పేమో అనిపించింది.
రాత్రిళ్ళు
అలా రహదారుల్లో
డ్రైనేజీ గొట్టాల పరిసరాల్లో
చెత్త కుండీల పక్కన నిదురించే శాపగ్రస్తులకు
దూరంగా ఉండాలని గుర్తుకొచ్చి
నా నడక లో
వేగం పెంచాను ఎందుకైనా మంచిదని,
రాత్రినీ, ఆగాలనిపించిన ఆలోచనను
పక్కకు మళ్ళించాలని
ప్రయత్నించిన
ఆ ఏడుపులాంటి శబ్దం
వినిపిస్తూనే ఉన్నా
నేనే తప్పేమో అనిపిస్తూనే ఉన్నా
నగరం నడిబొడ్డున అలా,
కాలి బాట పక్కన
షాపుల అరుగుల మీద
బస్ స్టాండుల్లో
విడిచేసిన చెప్పుల్లా ఎక్కడ బడితే అక్కడ
అసౌకర్యాల అంచుల పై
ఆవర్తనల గొడుగుకు దూరంగా
మానవత్వం ఆశ్రయం కోసం అలమటిస్తూ
నేనెక్కడ దోపిడీ కి గురౌతానోనని భయం నాలో ....
మానవత్యము చూపించాలని వున్న.. మానవత్యము అనేది బలహీనత గా బావించె ఈ సమాజము ముందు బయపడూతూ.. మానవత్యము ను మరింత గా చంపుతున్నాను(ము).
ReplyDeleteఅప్ప్దుడప్ప్దుడు మీలాంటి పెద్దలు గుర్తు చెసినప్ప్దుడు..నేను
చంపిన మానవత్యము మరలా పునర్జీవమవుచున్నది.
"మానవత్వం చూపించాలని వున్నా .... మానవత్వం అనేది బలహీనత గా బావించే ఈ సమాజము ముందు భయపడుతూ .... మానవత్వం ను మరింత గా చంపుతున్నాను(ము).
ReplyDeleteఅప్పుడప్పుడూ మీలాంటి పెద్దలు గుర్తు చెసినప్ప్దుడు .... నేను
చంపిన మానవత్వం మరలా పునర్జీవమవుచున్న భావనేదో నాలో కలుగుతుంది."
స్పందన బాగుంది
సమాజం పట్ల బాధ్యతాభావన చూస్తున్నాను. ధన్యవాభివాదాలు మంజు ప్రవీణ్ గారు! సుప్రభాతం!
అస్సలు మానవత్వం ఉంటేగా చంపుకోవటానికి, దాన్ని ఎప్పుడోపాతిపెట్టాము.
ReplyDelete"అస్సలు మానవత్వం ఉంటేగా చంపుకోవటానికి, దాన్ని ఎప్పుడో పాతిపెట్టాము." అన్న మీ స్పందన లో .... ఆవేశం, కసి, బాధ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి, ఏమీ చెయ్యలేకపోతున్నాము గా అని
Deleteధన్య....అభివాదాలు ఫాతిమా గారు!