ఎన్నినాళ్ళుగానో ప్రయత్నిస్తూ వున్నా
నా చెలీ! .... నీకో ప్రేమలేఖ రాయాలి అని,
వృధా పదాలు లేని
నిండు భావనల ప్రేమతో
ఎక్కడా లేనట్లు గా
విసుగేసే ప్రాసలు, శ్లేష పదాలు .... వాడకుండా
నీ హృదయాన్ని చేరాలని ....
కానీ పదాలు తిరగబడుతున్నాయి.
ప్రయత్నించీ రాయలేకపోతున్నాను.
నీ ఎద మృదు భావనల్ని
నీ చూపుల అయస్కాంత శక్తి ని,
నీ మనసు వైశాల్యాన్నీ .... వర్ణించలేక పోతున్నాను.
ఎంతో బాధ, వ్యద
భావనలతో పోరాటం ....
పక్కన నీవు లేక, ఏదో భయం
ఆలోచనల్లో ఒంటరితనం ....
నాకు నేను సగం పిచ్చివాడ్ని అవుతూ,
పక్కన లేని నీవే నాకు కావాలి అని.
నీ ప్రేమ కోసమే జీవించాలి అని
నా జీవన అమూల్యానుభవానివి నీవే అని
చెప్పి, చూపించాల్సిన అవసరం నాదే అని
ప్రేమ బాషలో, నీకు మాత్రమే అర్ధం అయ్యేలా ....
విడమర్చేందుకు అక్షరాలు కూర్చుకుంటున్నాను.
అయినా, నా ప్రయత్నం ఫలించను, పదాలు చాలడం లేదు.
ఇది కేవలం ప్రేమలేఖ కాదేమో..
ReplyDeleteతన ప్రేమనే కాదు, ఆమెపై తనకున్న అభీష్టాన్ని తెలియపరచటానికి భాష సరిపొదేమూ, లేక అక్షరాల అసహాయత కనబడిపోతుందేమో,
ఇన్ని సంశయాలు కవి హృదయాన్ని ఊపేస్తున్నాయి.
Delete"అది కేవలం ప్రేమలేఖ మాత్రమే కాదేమో .... అతని ప్రేమను, అతనికి ఆమెపై వున్న అభీష్టం తెలియపరచడం, భాష సరిపోకపోవడం లా వుంది. ఒకరకంగా అక్షర అసహాయత కూడా కావొచ్చు! ఎన్నో సంశయాలు కవి హృదయాన్ని ఊపేస్తున్నట్లుంది కవిత."
బాగుంది స్నేహాభినందన స్పందన. ఒకటి విజ్ఞత మరోటి పాండిత్యం .... రెండింటి మధ్య నలిగిన పదభావనల పై విశ్లేషణ లా.
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!