Saturday, October 26, 2013

అందానికి మరో పేరు నా సహచరి


నీకు తెలుసా!
ఎప్పుడైనా
విహారానికి వెళ్ళినప్పుడు
మనం చేరువలోకి రాగానే
ఊపిరి ఆగిపోయినట్లు
ఎందరో
దృష్టిని మరల్చకుండా
మనవైపే చూస్తుండటం!?
...........
నీకు తెలియదు
వారు అలా ఎవరిని చూస్తున్నారో

నిజం!
నిజంగా నీకు తెలియదు.
నీవు,
ఒక సుందర,
సుకుమార, మధుర
మనోజ్ఞ సౌందర్యరాసివి అని.
ఎన్ని సార్లో అన్నాను.
సౌందర్య దేవతా .... అని,
..............
ప్రతి ప్రియుడి కళ్ళకు
ప్రేయసి అలాగే కనిపిస్తుంది.
అని నవ్వేదానివి.

అప్పుడప్పుడూ
వీధి చివరివరకూ నీవు
నెమ్మదిగా
నడిచివెళుతున్నప్పుడు,
ఎవరైనా
ఈలవేసి, నీ సౌందర్యాన్ని
ప్రసంశిస్తుండటం
నీవు చూడటం
సరికాదని,
...............
నీకు తెలుసా?
ఎన్నిసార్లు ఎంత ఆయాస పడ్డానో.

సూర్యోదయవేళల్లో
గజిబిజి గా,
నీ నుదుటి పై జారిన
జుట్టు తో ....
నీకు నీవు
చెత్తలా కనిపిస్తున్నప్పుడు,
నాకు మాత్రం
నీవు ముడిముత్యం లా
ఎందుకో తెలియదు.
.................
నీ మీదనుంచి
కళ్ళు మరల్చలేని క్షణాలవి.


4 comments:

  1. ప్రతి ప్రియుడి కళ్ళకు
    ప్రేయసి అలాగే కనిపిస్తుంది...
    ముడిముత్యం లా...
    జడి ఆత్రం లా...

    శుభాభినందనలు...

    ReplyDelete
    Replies
    1. ప్రతి ప్రియుడి కళ్ళకు
      ప్రేయసి అలాగే కనిపిస్తుంది...
      ముడిముత్యం లా...
      జడి ఆత్రం లా...

      శుభాభినందనలు...

      చాలా చక్కని స్పందన ఏకీభావన స్నేహాభినందన
      నమస్సులు ఎన్ ఎం రావు బండి గారు!

      Delete
    2. స్నేహాభినందనకు అభివందనం...
      గౌరవ ఆలింగనం...

      Delete
    3. __/\__లు ఎన్ ఎం రావు బండి గారు!

      Delete