ఉపద్రవాలకు దూరంగా,
వెచ్చదనం ఆశ్రయంగా,
జీవితాన్నిచ్చే ఒక మంచి మనసు,
స్వేచ్చనిచ్చే ఒక సహృదయం కావాలి.
ఉత్తమ జీవితం అర్ధం తెలిపి
నాతో కలిసి సహచరించేందుకు.
నా స్వంతం అయిన
దేన్నైనా ఇచ్చేస్తా!
ఈ జీవితం, ఈ హృదయం, ఈ శ్వాస
నాది అనే యేదైనా
బేషరతుగా సమర్పించుకుంటాను.
ప్రతిగా అలాంటి తోడును పొందేందుకు.
ప్రేమించడం నేర్పి
దేన్నైనా కొంతవరకే విడమర్చి,
నాకు నేను మార్గం వెదుక్కునేలా
శిక్షణ నిచ్చి ....
తనున్నాననే నమ్మకాన్నిచ్చే
ఎవ్వరూ ఎరుగని
నను వీడని భావం శాశ్వతత్వం కోసం
అప్పుడప్పుడూ ఆలోచనొస్తుంది.
ఎవరినైనా ఘాడంగా
ప్రేమించి నప్పుడు,
అంతా నా ఇష్టమే అనుకునేంతగా ....
వేరెవరో కూడా వారిని ప్రేమిస్తే,
వారిని నేను కోల్పోవాల్సొస్తే,
ఎవరైనా వారిని నాకు దూరంగా తీసుకుపోతే .... అని.
అప్పుడు,
నా అభ్యర్ధన ....
వారికీ వినపడదు గా అని,
నా మనసు చెప్పే పదభావనలు ....
చేరాల్సిన మనసును చేరవు గా అని,
ఆ వెచ్చని స్పర్శ లో అమరత్వం కోసం
నేను పడే తపన అర్ధం కాదు కదా అని.
ఈ మానసిక స్థితి అబద్రతా భావాన్ని తెస్తుంది, దీని నుండి బైట పడటానికి చిన్న చిన్న చికాకులు ఎదురవుతాయి.
ReplyDeleteఏమిటో ఈ జీవితం అనే వేదాంతంతో ... ఆగిపోతుంది...:-))))
ఈ మానసిక స్థితి అభద్రతా భావన, దీని నుండి బైట పడటానికి చెసే ప్రయత్నంలో చిన్న చిన్న చికాకులు ఎదురవుతాయి.
Deleteఏమిటో ఈ జీవితం .... అనే వేదాంతంతో ... ఆగిపోతుంది...:-))))
బాగుంది విశ్లేషణ స్పందన స్నేహాభినందన
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!