నిన్నటి రాత్రి
నా చెలి నా సరసనే ఉంది.
నన్ను ఆలకిస్తూ,
నా మాటలు నిజం అని నమ్మి ....
ఇంతకు ముందెన్నడూ
ఎవరూ చూపని ఆసక్తి చూపింది.
ఒకరితో ఒకరు పంచుకున్నాం.
మా జ్ఞాపకాలను, జీవనానుభవాల్ని
మా భిన్న సంస్కృతుల, జాతుల ....
మా మనోగతాలను
ఒంటరిగా ఆమే, నేనూ ఆ నక్షత్రాలు సాక్షిగా.
నిజం గా, నిన్నటి రాత్రి
మా కలయిక ఒక మరిచిపోలేని జ్ఞాపకం
ఆలశ్యం అయ్యిందని
ఎద లోకి ఆహ్వానించాను
సేదదీరుతూ మరిన్ని అనుభవాల్ని
దాచుకునున్న జీవనానుభూతుల్ని
కొన్ని నమ్మకాల్ని
ఎన్నో అణచివేసుకున్న, అసామాజిక
ఉద్వేగభరిత ఆలోచనల్ని కక్కేసాను.
నిన్నటి రాత్రి,
నా ప్రేయసి నన్ను హృదయం తో ఆలకించింది.
నన్ను, నా మదిమాటల్ని నిజమని నమ్మింది.
నా సరసన నిలిచి, కలిసి నడిచేందుకు సిద్ధపడింది.
ఇంతకు ముందెన్నడూ
ఎవరూ వినడానికి ఇష్టపడని, ఆలోచించని
తీరని నా మనోభారం .... ఆలకించేందుకు నాకో తోడు దొరికింది!
మనోభారాన్ని మనస్విని మాత్రమే తీరుస్తుంది. కలకాదు కదా...:-)
ReplyDeleteమనోభారాన్ని మనస్విని మాత్రమే తీరుస్తుంది.
Deleteఔనూ ఇది కలకాదు కదా...:-) .... స్పందన
ఇంతకు ముందెన్నడూ ఎవరూ వినడానికి ఇష్టపడని, ఆలోచించని తీరని నా మనోభారం .... ఆలకించేందుకు నాకో తోడు దొరికింది కలలా!
నోరు తెరిస్తే పేగుల్లెక్కపెట్టేవారున్నారని తెలుసు. కవితలో రాయని భావం .... చెప్పగలగడం ఊహించగలగడం ఒక వింత అనుభవం తొలిసారి నాకు.
ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!