అతను చాలా సరదాగా, ఎంతో సాధారణంగా ఉంటాడు. చిలిపి పనులు చేస్తూ.
అతనితో ఉండటం ఆమెకు చాలా ఇష్టం.
తిడతారని తెలిసీ చావిట్లో కట్టేసిన లేగదూడను విప్పేసి, తిడుతుంటే బుద్దిమంతుడి లా తలొంచుకుని పడుతుంటాడు.
దొంగతనం గా కోసుకొచ్చిన ఫలాల్ని ఆమె తో పంచుకుని తింటూ అన్నీ మరిచిపోతుంటాడు.
ఎంత అదృష్టవంతురాలినో అనుకుంటుంటుంది ఆమె అప్పుడప్పుడూ.
ఆమె జీవితం లో అతనే మొదటి వ్యక్తి.
ఏనాడూ ఏ అమ్మాయినీ ఆకట్టుకునేందుకు ప్రయత్నం చెయ్యలేదు. అతని మనస్తత్వం ఆమెకు ఇష్టం. ఏనాడూ ఎవరిలానూ ఉండాలని చూడని మొండిమనిషి కానీ నిండైన వ్యక్తిత్వం. మనసుకు నచ్చినట్లు నడుచుకుంటాడు ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా.
ఆమె అంటే అతనికి ప్రేమ, గౌరవం. యాక్సిడెంట్ లో కాళ్ళు కోల్పోయినా ఆమెలో అంగవైకల్యం కనపడదు అతనికి. యాక్సిడెంట్ ముందులానే పలుకరిస్తూ. ఉడికించి ఆనందిస్తూ. ఆమె ఆనందం లో తన ఆనందాన్ని చూసుకుంటాడు.
సమాజం, కుటుంబం కట్టుబాట్లు గౌరవం కోసం ఆలోచించడు.
అందుకే అతనంటే ఆమెకు ప్రాణం.
నిజమే...అతనో...విధాతకు ప్రతిరూపం.
ReplyDeleteఆమెలో వెలిగే ఆశా కిరణం.
నిజమే .... అతనో .... విధాతకు ప్రతిరూపం. ఆమెలో వెలిగే ఆశా కిరణం. .... స్పందన
Deleteనా ఈ చిన్న టపా మీకు నచ్చినందుకు
ధన్యవాదాలు ఫాతిమా గారు.