Tuesday, October 15, 2013

ఒక అందమైన వ్యక్తిత్వం ఆ స్నేహం

ఆమె ఒక స్వేచ్చాజీవి 
ఐదో పదిలో పడిన పిదప కూడా
ఒక అందమైన వ్యక్తిత్వం ఆమె 
నాకు ఆమె అంటే .... ఇష్టం, ఆమె నడవడిక,
హుందాతనం, ఆ నిండైన నమ్మకం 
నాకు ఎప్పుడూ సాదర ఆహ్వానం 
ఆమెను కలవడం నాకు సంతోషం 
చాలా సాధారణం గా సింపుల్ గా ఉంటుంది.
అందరితో కలిసిపోయే స్వభావం ఆమెది. 
వయస్సు, 
ముడతలు కనపడకుండా .... క్రీములు, 
తెల్లని జుట్టు కనబడకుండా .... డై లు వాడని, 
నాచురల్ గా వయసు కనపడాలనే .... 
ఆమె, ఒక మంచి తల్లి! 
ఒక మంచి భార్య! ఒక మంచి స్నేహితురాలు.
ఆమె హృదయం నిరంతరమూ 
ఉట్టిపడే యౌవ్వనం 
ఆమెకు జీవితం అంటే అమితమైన ప్రేమ
ఏబై ఏళ్ళు పైబడ్డాయని అనుకోలేము 
ఆమెను చూసి, 
వయస్సు కాదు, ఆమె కనిపిస్తుంది ఆమెలో. 
ఒక అందమైన మహిళ ....
ఎలాంటి ఆత్మస్తుతి, అహంకారం, 
వంచన, కపటము తెలియని 
ఒక సుందర వ్యక్తిత్వం 
గోరువెచ్చని ఆమె చిరునవ్వు లో

2 comments:

  1. "ఆమె" ఒక సుందర వ్యక్తిత్వం, సుమదుర పరిమళం , కానీ ఆమె స్నేహాన్ని కోరే మనస్సు ఉంటుంది చాలా సున్నితం.
    సర్, మీ కవిత లోని స్నేహ స్వభావం అనితర సాద్యం.

    ReplyDelete
  2. ""ఆమె" ఒక సుందర వ్యక్తిత్వం, ఆమె ఒక సుమధుర పరిమళం, కానీ ఆమె స్నేహాన్ని కోరే ఆ మనస్సు చాలా సున్నితం.
    సర్! మీ కవిత లోని స్నేహ స్వభావం అనితర సాద్యం."
    ఎంతో గొప్ప కాంప్లిమెంట్! అతి అరుదుగా దొరుకుతుంటాయి మీనుంచి కాంప్లిమెంట్స్. భద్రంగా దాచుకుంటాను. నిజానికి జీవితం లో మనిషి మరిచిపోలేని మాధుర్యాలు .... పసితనం, బాల్యం ఆ పిదప స్నేహం అని నమ్మే వాళ్ళలో నేనూ ఒకడ్ని.
    _/\_లు ఫాతిమా గారు! బక్రీదు అంటే తెలియదు. ముఖ్యమైన రోజు అని మాత్రమే తెలుసు. మీకూ మీ బంధు మిత్ర పరివారానికి నా హృదయపూర్వక శుభాకాక్షలు.

    ReplyDelete