ఔనూ! ఎందుకిలా?
ఎందుకు
ఆ కోకిల
మోహన రాగమే పాడుతుంది?
ఇక్కడ
నేను బాధపడుతూ ఉంటే ....
ఆ జంటలు, ఆ నవ్వులు
ఆ యిక యిక, పకపకల ఆనందం
చూడలేకపోతున్నాను.
ఇక్కడ, నా పై కోపం తో
నా చెలి .... నాకు దూరం అవుతూ ఉంటే
ఎందుకు
నా జీవ ప్రణయకావ్యం
అసంతులనంగా అసంపూర్ణంగా ఉంది?
కాలాన్ని మించినన్నినాళ్ళు
నేనూ ఆమె ఒకరికొకరం తోడూ నీడాగా ఉండీ
నా ప్రపంచం, ఆమె ప్రపంచం అంటూ
ఇప్పుడే, వేరు వేరు అయ్యాయి ఎందుకో?
అగ్ని సాక్షిగా, ఏడడుగులు వేసి
ఎప్పటికీ కలిసుంటామని,
ప్రమాణాలు చేసుకున్నాక కూడా!
ఎందుకు? ఎందుకిలా?
ఎంత ప్రేమికులైనా తమతమ ప్రపంచాలు వేరే,
ReplyDeleteఉలిక్కిపాటులోనే మొత్తంకోల్పోతున్నామా అనే భయం
ఎంత ప్రేమికులైనా వారి ప్రపంచాలు వేరు, ఉలిక్కిపాటులోనే మొత్తం కోల్పోతున్నామా అనే భయం భావమే ప్రశ్నలు ....
Deleteబావుంది స్పందన, విశ్లేషణాత్మక సూచన
ధన్యాభివాదాలు మెరాజ్ గారు!
మన వేదన మొరోకటికి ఆనందం అదే జీవితం అండి....చాలా బావుంది మీ కవిత చంద్ర గారు
Deleteమన వేదన మొరోకరికి ఆనందం అదే జీవితం అండి....
ReplyDeleteచాలా బావుంది మీ కవిత చంద్ర గారు .... బావుంది స్పందన స్నేహ ఆత్మీయ అభినందన
ధన్యవాదాలు మంజు యనమదల గారు!
ధన్యవాదాలు laila silu!
ReplyDelete