ఒత్తిడి తో ఏదీ సాధ్యం కాదు.
అడుగడుగూ అవరోధకాలే అయితే,
సావధానంగా ఆలోచించక పోతే
మనిషి, తనకు తానే అర్థం కాకపోతే.
అవగాహన అవసరమూ అర్ధమూ లేదు
సర్ధుకుని కదిలే ఉద్దేశ్యం లేక పోతే
అనుభవజ్ఞతను మూర్ఘత్వం అనుకునే,
అహం నిలువెల్లా ఆవహించి ఉంటే ....?
జీవితం లో, లొంగిపోవాల్సిన సమయం ఒకటొస్తుంది.
అందమైన ముగింపు చూసేందుకు
అప్పుడప్పుడూ వేచి చూడాల్సి వస్తుంది.
స్వేదించాల్సొస్తుంది. తప్పదు .... జీవితం కల కాదు.
నిశ్చయంగా తెలుస్తుంది, జీవితం అందమైనదే అని
ఆమోదించే సామర్థ్యం మన మనసులో ఉంటే
జీవితమే ఒక సంతోషంగా సాగే జీవ సరళి ....
సాటి మనిషితో కలిసి నడిచే సహృదయం మనలో ఉంటే
కవితలోని ఆకరి నాలుగు లైనులు జీవితాన్ని వడపోసినట్లున్నాయి.
ReplyDeleteకొత్త పద ప్రయోగం " స్వేదించాల్సి" అద్భుతంగా ఉంది.
కవిత లోని ఆఖరి నాలుగు లైనులు జీవితాన్ని వడపోసినట్లున్నాయి. కొత్త పద ప్రయోగం "స్వేదించాల్సి" అద్భుతంగా ఉంది......స్పందన ఒక స్నేహ ఆత్మీయ ప్రోత్సాహక అభినందన
ReplyDeleteధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!