సూర్యుడు
బలహీనుడై పశ్చిమాన
సంద్యా సమయాన
ఆ చెట్ల, చిటారు కొమ్మల
నీడలలో .... కాంతిని కోల్పోతూ
పూర్తిగా, చీకటికి
దాసోహమవడం చూస్తున్నాను.
నాలో బాధ, మదిలో అశక్తత తో
ఊహించుకుంటున్నాను.
ఏదో ఒకరోజు
ఈ జీవితమూ ఇంతేనేమో అని.
కాంతి క్షీణించి
పరిస్థితులకు లొంగి,
చీకటిని, అయోమయాందకారాన్ని ....
లోనికి రానియ్యడం తప్పదేమో అని.
అన్నీ నెమ్మదిగా, నాజూకుగా ....
పోగొట్టుకోవడం తప్పదేమో అని.
నిజం!
ఇది ఒక తియ్యని బాధ
ఒక తప్పని అందమైన విచారం!
నిజమే... దీన్ని అందరమూ ఆహ్వానించాలి.
ReplyDeleteనిజమే .... ఈ స్థితి ని అందరమూ ఆహ్వానించాల్సిందే .... స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
Deleteధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!