Monday, October 28, 2013

ఏకాంతం

మనసు మెచ్చేట్లు బ్రతకాలని. 
కానీ, ఈ సమాజం 
నా రహశ్య జీవనం లోకి 
ప్రాకుతూ, 
మీదిమీదకు వచ్చేస్తుంది. 
నా బ్రతుకును నిర్ధారించేందుకు.

ఎంతో దూరం పారిపోలేను. 

చెట్టు ను కాని. 
యాంత్రికంగా బ్రతకలేని, 
శిలను కాని నేను. 
మార్పు దిశగా కదిలే 
అడుగుల పడే చేతనత్వం ఉనికిని.  

ఏకాంతం దూరమై ఇక్కడే దొరికిపోతాను.

4 comments:

  1. నిజమే అండి చంద్ర గారు కవిత మొత్తం మనసు సంఘర్షణ చెప్పినట్టుగా అనిపించింది
    మనసు మెచ్చేట్లు బ్రతకాలని.
    కానీ, ఈ సమాజం
    నా రహశ్య జీవనం లోకి
    ప్రాకుతూ,
    మీదిమీదకు వచ్చేస్తుంది.
    నా బ్రతుకును నిర్ధారించేందుకు.

    చాలా బావుంది

    ReplyDelete
    Replies
    1. "నిజమే అండి చంద్ర గారు కవిత మొత్తం మనసు సంఘర్షణ చెప్పినట్టుగా అనిపించింది
      మనసు మెచ్చేట్లు బ్రతకాలని.
      కానీ, ఈ సమాజం నా రహశ్య జీవనం లోకి ప్రాకుతూ,
      మీదిమీదకు వచ్చేస్తుంది. నా బ్రతుకును నిర్ధారించేందుకు.
      చాలా బావుంది .... "
      కొన్ని సామాజిక కట్టుబాట్లు సంకెళ్ళై మనిషిని నిబద్దించి బ్రతుకును నిర్ధారించుతూ అప్పుడప్పుడూ పురోగమనానికి అవరోదం గా నిలవడం ఎంతో బాధను కలిగిస్తుంది.
      బాగుంది స్నేహాభినందన మీ స్పందన
      ధన్యాభివాదాలు మంజు గారు!

      Delete
  2. సమాజాన్ని మీ నుండి దూరం చేసుకోలేరు,
    కానీ ఒక్కోమారు సమాజం మిమ్ము విసిరేస్తుంది
    దానికి మీ అవసరం కలిగే వరకూ,
    దానిపక్కనే నక్కలా నక్కిన వ్యక్తిని మాత్రమే అది ఉండనిస్తుంది.
    సర్, అందుకే రుషులూ, యోగులూ సమాజాన్ని త్యజించేది

    ReplyDelete
    Replies
    1. "సమాజాన్ని ఎంత వద్దనుకున్నా మీ నుండి మీరు దూరం చేసుకోలేరు,
      కానీ ఒక్కోమారు సమాజమే మిమ్ము విసిరేస్తుంది. దానికి మీ అవసరం కలిగే వరకూ,
      దానిపక్కనే నక్కలా నక్కిన వ్యక్తిని మాత్రమే అది ఉండనిస్తుంది. సర్, అందుకే ఋషులూ, యోగులూ సమాజాన్ని త్యజించేది."
      నిజమే! సమాజమే మూలం మనిషి మనుగడకు. చైతన్యపదం వైపు సాగాలనుకున్న మనిషి .... ఒక్కోసారి అసాంప్రదాయక నిర్ణయాలతో ముందుకు రావాల్సొస్తుంది. ఆ అసాంప్రదాయకాలను సాంప్రదాయకాలుగా వొప్పించడానికి అతని శక్తులన్నీ వినియోగించాల్సొస్తుంది. ఒక గురజాడ, ఒక కందుకూరి లాంటి ఎందరో మహానుభావులు అన్ని సమయాల్లోనూ పుట్టడం సాధ్యం అనుకోలేకపోతున్నాను. ఆ నేపద్యం లో రాసిన కవిత మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.
      మంచి మంచి సామాజికవితలు రాసే మీలాంటి కవయిత్రుల స్పందనలు నాకు ఒక గొప్ప ప్రోత్సాహం. శుభసాయంత్రం మెరాజ్ ఫాతిమా గారు!!

      Delete