Tuesday, October 1, 2013

ఆకాశం తోబుట్టువును


నన్నందరూ దాత్రీ అని పిలుస్తారు.
సహనం నా ముద్దుపేరు! 
సముద్రం నా ఇల్లు. 
నాదొక సజీవ పురాణం! 
ఒక నావికుడి కలల జననం నేను.

ఎంతో అస్పష్టం .... నా జీవ నట సరళి.
కొందరి భావనల్లో మాత్రం
స్వచ్చతను అద్భుతాన్ని నేను. 
ఒంటరి కలలు కంటూ 
సముద్ర గర్భం లో జీవ ప్రేమ సూత్రధారిని.

4 comments:

  1. ఇతరుల భావనలో ఉన్నతముగా ఉండటం ఓ గొప్ప అనుభవం, అదృష్టం కూడా. బడబాగ్ని లో ఉన్న ప్రాణవాయువు మీరు.

    ReplyDelete
  2. సాటి కవి భావనల్లో ఔన్నత్యం చూడగలగడం ఉదాత్తత. ఓ గొప్ప అనుభవం, గొప్ప అదృష్టం కూడా.
    అక్షర సరస్వతి అభినందనలు అందుకోగలగడం ఎంత అదృష్టమో కదా!
    అభివాదాలు ఫాతిమా గారు.

    ReplyDelete
  3. చక్కని కవిత .... స్పందన అభినందన
    ధన్యవాదాలు పద్మార్పిత గారు.

    ReplyDelete