నీవు కళ్ళు మూసుకుంటే
ఆ కలలో కనిపించే ముఖాన్ని కావాలని
ఏ రాత్తిరైనా నీవు సేద దీరే
కోరుకునే వెచ్చదనం స్పర్శను కావాలని
నీ ఊహల్లో పరవశాన్ని జగదేకసుందరిని
ఒక అద్భుత సౌందర్యాన్ని కావాలని
కలకు వాస్తవం కు మధ్య
అన్నీ నేనే అయ్యుండాలని .... నీ జీవితం లో
నీవు ఎల్లప్పుడూ నాకోసమే తపించాలని
నన్నే నీవు శ్వాసిస్తుండాలని
నా భావనలతో నీ మది మొత్తం నిండిపోయి
అన్నింటిలోనూ నీవు నన్నే చూస్తూ
నీ ప్రతి కలలోనూ నేనే అయి
నేను నిన్ను చూస్తు పరామర్శిస్తున్నట్లు
నా సాన్నిహిత్యమే నీ పారవశ్యం అవుతూ
ఇక్కడ, నా మనసంతా నీవై నీండిపోయిన విధంగా
నీ కనుచూపును కావాలని .... కోరుకుంటున్నాను
లోతుగా నీవు నీ ఆత్మలోకి చూసుకునే చూపును కావాలని
నీ ప్రపంచమంతా నేనే అయినట్లు
పరిపూర్ణతను నీవు నా కలయిక ద్వారా ....
నీవు ఎంతగానో కోరుకునే పరవశం
ఒక ఘాడమైన ముద్దును నేను కావాలని
నీ ప్రతి కోరిక పరిణామం సమాధానం
నీవు కోరుకునే అమరత్వం నేను కావాలని
ఎవరూ ఎన్నడూ చూడని ఊహకందని
అద్భుతం, ఆసక్తిని నేను అని .... నీకు అనిపించాలని
నేను నిన్ను కోరుకుంటున్నంత ఘాడం గా
నన్ను దూరంగా వెళ్ళనీయని భావన నీలో ప్రబలి
నీ గుండె లోతుల్లో
నీవు ప్రతిష్టించుకునుండాల్సిన నీ దేవతనై ఉండాలని
నీ పరిసరాలు .... వీచే గాలీ, పారే నీరూ, రగిలే అగ్ని,
ఆ ఆకాశం, ఈ భూమి అన్నీ నేనై నిండిపోవాలని .... నీ జీవితం లో
ఎంత బలీయమైన స్పందన ఉందో..,ప్రతి భావములోనూ,
ReplyDeleteసాదారణం గా అనిపించినా అసాదారణా అమృత గుళికలు అప్పుడప్పుడూ మాకు ఇస్తూనే ఉంటారు. బొమ్మలూ, పదాలూ బాగున్నాయి సర్.
ఎంత బలీయమైన స్పందన ఉందో...., ప్రతి భావములోనూ,
Deleteసాదారణం గా అనిపించినా అసాదారణా అమృత గుళికలు అప్పుడప్పుడూ మాకు ఇస్తూనే ఉంటారు.
బొమ్మలూ, పదాలూ బాగున్నాయి సర్.
ఎంతో బలమైన భావనల పద స్పందన, బొమ్మలూ ఫొటోలు జోడించితే బాగుంటుందని మెరాజ్ ఫాతిమా గారు ఇచ్చిన సలహామేరకు చిత్రాలను జోడిస్తున్నాను. ఎంతవరకు న్యాయం చెయ్యగలుగుతున్నానో మీరే చెప్పాలి. మీ అభినందనను ప్రోత్సాహక స్పందన గా భావిస్తాను
ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు! సుప్రభాతం!!
ReplyDelete" నీవు ఎల్లప్పుడూ నాకోసమే తపించాలని
నన్నే నీవు శ్వాసిస్తుండాలని
నా భావనలతో నీ మది మొత్తం నిండిపోయి
అన్నింటిలోనూ నీవు నన్నే చూస్తూ
నీ ప్రతి కలలోనూ నేనే అయి ... "
ఎంతో మృదు మధురమైన భావాలు మీవి.
చాలా ఇంపుగా మలిచారు మీ కవితని .
అభినందనలు చంద్ర గారు.
*శ్రీపాద
"నీవు ఎల్లప్పుడూ నాకోసమే తపించాలని, నన్నే నీవు శ్వాసిస్తుండాలని
Deleteనా భావనలతో నీ మది మొత్తం నిండిపోయి .... అన్నింటిలోనూ నీవు నన్నే చూస్తూ, నీ ప్రతి కలలోనూ నేనే అయి .... "
ఎంతో మృదు మధురమైన భావాలు మీవి. చాలా ఇంపుగా మలిచారు మీ కవితని. అభినందనలు చంద్ర గారు.
చాలా బాగుంది స్నేహ ప్రోత్సాహక అభినందన మీ మృదు మధుర భావనల స్పందన
ధన్యాభివాదాలు శ్రీపాద గారు!
నీవు ఎల్లప్పుడూ నాకోసమే తపించాలని
ReplyDeleteనన్నే నీవు శ్వాసిస్తుండాలని
నా భావనలతో నీ మది మొత్తం నిండిపోయి
అన్నింటిలోనూ నీవు నన్నే చూస్తూ
నీ ప్రతి కలలోనూ నేనే అయి
నేను నిన్ను చూస్తు పరామర్శిస్తున్నట్లు...... స్వార్ధం ఉన్నా దానికి పదింతలు ప్రేమభావాలు ఉన్నాయి వాక్యాలలో
నీవు ఎల్లప్పుడూ నాకోసమే తపించాలని, నన్నే నీవు శ్వాసిస్తుండాలని
Deleteనా భావనలతో నీ మది మొత్తం నిండిపోయి .... అన్నింటిలోనూ నీవు నన్నే చూస్తూ, నీ ప్రతి కలలోనూ నేనే అయి
నేను నిన్ను చూస్తు పరామర్శిస్తున్నట్లు......
స్వార్ధం ఉన్నా దానికి పదింతలు ప్రేమభావాలు ఉన్నాయి వాక్యాలలో
చక్కని పరిశీలన చిక్కని విశ్లేషణ .... బాగుంది ప్రోత్సాహక అభినందన స్పందన
నమస్సులు పద్మార్పిత గారు! శుభోదయం!!
ప్రేమలోని స్వార్ధాన్ని చాలా సున్నితంగా వివరించారు బాగుంది చంద్రగారు.
ReplyDeleteప్రేమలోని స్వార్ధాన్ని చాలా సున్నితంగా వివరించారు
Deleteబాగుంది చంద్రగారు.
బాగుంది అభినందన స్పందన
అభివాదాలు శ్రీదేవీ!