జీవితం లో నరకయాతన
దిగజారిపోవడం
అర్ధం అప్పుడే తెలిసింది.
రకరకాల ఆర్ధిక సమశ్యలు,
అప్పుల్లో కూరుకుపోయి
ఋణ విముక్తుడ్ని,
మళ్ళీ సామాన్యుడ్ని కావాలని
ఉపరితలాన్ని చూడటమే గమ్యం గా
పడిన కష్టం ....
కనీసం, శ్వాసించగలననే
పీకలవరకూ
ఊబిలో కూరుకుపోయిన అసహాయత
ఏ ప్రత్యక్ష ఒత్తిడి లేకపోయినా
ప్రతి ప్రయత్నం లోనూ,
మరింతగా దిగజారి
ఆర్ధిక నిపుణులు చేస్తున్న హెచ్చరికలు
ఒడ్డున కూర్చున్న వారి సలహాలు గా
మనసు పై తీవ్ర ఒత్తిడై,
ఆ భరించలేని బాధ, పెనుగులాటలో
మరింతగా దిగబడి, అప్పుల పాలై పోయి
రాత్రి చల్లనిదే కానీ, ఆ శూన్యత లో,
ఆ అంధకారం లో కళ్ళు మూయడం మినహా
ఏమీ చెయ్యలేని అశక్తత
నాలో నాకు ఉపశమనం పొందాలని
ఆశ .... సమశ్యల్లొంచి వెలికి రావాలి
నింపాదిగా శ్వాసించాలి అని .... ఆశ
ఆ క్షణాల్లో, నా కళ్ళలోంచి కారిన
కన్నీళ్ళ వెచ్చదనం మాత్రం
ముఖాన్ని తడిపేస్తూ
నేనూ మనిషినని,
భావనలున్నాయి నాలోనూ అని గుర్తుచేస్తూ
No comments:
Post a Comment