అంతా జీవితమే! బ్రతుకు ఆటలో భాగమే,
వైఫల్యాలను తప్పించుకోవాలనే ప్రయత్నం లో
పాఠాలు నేర్చుకోవడం
ఆశల సమీపానికి చేరి వేటాడాలనుకోవడం
అప్పుడప్పుడూ అతిగా ప్రవర్తించడం.
నిజం!
దిగజారిన క్షణాల లోనే మనిషి
నిజ వ్యక్తిత్వం చూడగలిగేది.
కోరికలు తీర్చుకోవాలనే ప్రాకులాటలో
కొంచెం కొంచెం గా
అంతా ఆక్రమించుకోవాలనే .... ఆరాటం లో
స్వేచ్చగా ఎగరాలని, ఎగరలేక
పడిన ప్రతిసారీ
అదే ఆఖరి అనుభవం కావాలని ....
జాగ్రత్తగా ఉంటాను అని సర్ధి చెప్పుకోవడం లో,
గుండె ఆతురత, తొందరపాటును సర్ధుకోవడం లో,
అవును ప్రేయసీ ....
నా నొప్పిని నీవు చూడగలుగుతున్నావా?
నిజంగా నీకూ నొప్పిగా ఉందా?
దూరంగా నడుస్తూ .... వర్షం లో
నా అడుగులు తడబడుతున్నప్పుడు,
పశ్చాత్తాపం తో ....
జారుతున్న నా కన్నీళ్ళను
నీ ప్రేమ కొసం
పిడచకట్టుకుపోయిన నా పెదాల దాహాన్ని
కలల ఎండమావుల వెంట
పరుగులు తీయడం నీడలో
నా అరాటాన్ని గమనిస్తున్నావా?
నాలానే నీవూ తపిస్తున్నావా?
ప్రేమే కారణం .... అదే లేకపోతే
హృదయం యాంత్రికతతో చిలుము పట్టక తప్పదు.
అందుకే ప్రియా! ....
రా! నా చెయ్యందుకో!
నన్ను విశ్వసించు! నిన్ను విశ్వసిస్తున్నాను.
నా మోహావేశపు వెన్నెల వీధుల్లో నాతో కలిసి నర్తించుతావని .... ఆశగా
ప్రేమే కారణం .... అదే లేకపోతే
ReplyDeleteహృదయం యాంత్రికతతో చిలుము పట్టక తప్పదు.
మీరు చెప్పినది నిజం చంద్రగారు.
ప్రేమే కారణం .... అదే లేకపోతే
Deleteహృదయం యాంత్రికతతో చిలుము పట్టక తప్పదు.
మీరు చెప్పినది నిజం చంద్రగారు.
బాగుంది స్పందన స్నేహ ఆత్మీయాభినందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!
ReplyDelete" నీ ప్రేమ కొసం
పిడచకట్టుకుపోయిన నా పెదాల దాహాన్ని
కలల ఎండమావుల వెంట
పరుగులు తీయడం నీడలో
నా అరాటాన్ని గమనిస్తున్నావా?
నాలానే నీవూ తపిస్తున్నావా? "
మీరిలా అన్నీ ......
ఇలా రాసుకుపోతే మరి
నాకు ఎం మిగులుద్ది రాసుకోడానికి ?
వామ్మో ! పరిగెత్తిస్తున్నారు !
(సరదా కోసం )
మంచి భావనలు.
పదిల పరుచుకునేవి కూడాను.
చంద్ర గారూ వావ్ అనిపించుకున్నారు.
*శ్రీపాద
Delete" నీ ప్రేమ కొసం
పిడచకట్టుకుపోయిన నా పెదాల దాహాన్ని
కలల ఎండమావుల వెంట
పరుగులు తీయడం నీడలో
నా అరాటాన్ని గమనిస్తున్నావా?
నాలానే నీవూ తపిస్తున్నావా? "
మీరిలా అన్నీ ......
ఇలా రాసుకుపోతే మరి
నాకు ఎం మిగులుద్ది రాసుకోడానికి ?
వామ్మో ! పరిగెత్తిస్తున్నారు !
(సరదా కోసం )
మంచి భావనలు.
పదిల పరుచుకునేవి కూడాను.
చంద్ర గారూ వావ్ అనిపించుకున్నారు.
స్పందన బాగుంది స్నేహ ప్రోత్సాహక అభినందన
ధన్యాభివాదాలు శ్రీపాద గారు! శుభసాయంత్రం!!