Friday, May 23, 2014

గతం నిట్టూర్పు




నిద్దుర లేని
ఉలికిపాటు గడియలే తలతిప్పి చూస్తే
వెచ్చని భుజాలపై
సుతారంగా
చేతి వేళ్ళు
కదిల్చిన జ్ఞాపకాల మధుర క్షణాలే

శంఖం లాంటి మెడ మీద చేతి వేళ్ళ కదలికలు
దిండు ఆసరాగా
వెన్నును వాల్చి విశ్రమిస్తున్న ప్రాణం
వెన్నెముకను తడిమినప్పుడు
నిదురిస్తున్న చర్మం మేల్కొని
దృడపడిన కండరాల ప్రతి స్పందనల లా

పెదవులపై నాలుకను కదిపి తడిపినప్పుడు
చిగురించిన తేమ మెరుపులు
మెత్తటి మేకులు
గుండె పై గుచ్చిన వైద్యం భావనలతో
ఉదరం నర్తించిన గతం అనుభూతులు దృశ్యాలై

బలవంతపు పీడ
నిట్టూర్పు లా .... అనవరతమూ
మదిలో మిగిలిపోయిన మరకల లా
శాంతంగానే ఉన్నట్లు ఉండి
ఊరిస్తూ అప్పుడప్పుడూ
ప్రకోపింపిస్తూ .... మది అస్థిమితమౌతూ




జ్ఞాపకాల తేనె తుట్టె కదిలి
ఒక శారీరక ఆపేక్ష
ఒక మానసిక అలజడి
ఒక తీరని మనో వాంచగా పరిణమించి
గుండె చప్పుడుకు తోడు, ఒక భారమైన నిట్టూర్పు లా

No comments:

Post a Comment