Friday, May 23, 2014

క్షంతవ్యుడ్ని ....



 











ఒక కొడుకునై నేను
నీవు కోరుకున్న విధం గా నడుచుకోనందుకు 
క్షమించవా! అమ్మా!
నన్ను, నా గతాన్ని
నా వర్తమానాన్ని, నా భవిష్యత్తును
నీ ప్రమేయం లేకుండా చేసుకుని
జీవితాన్ని కాలరాసుకున్నందుకు
ఉగ్గుపాలతో పాటు పోసి నీవు నేర్పిన పాటాలు
విస్మరించి
జీవితాన్ని దుర్వినియోగం చేసుకున్నందుకు

మన్నించవా! అమ్మా!
ఒక పాపాత్ముడి తల్లివని నీపై మోపిన భారానికి
నిన్ను,
నిరాదరించి 
అవసరానికి ఔషదం లాంటి
నీ మమతానురాగాల
సాన్నిహిత్యం ను నిర్లక్ష్యం చేసినందుకు
నేను క్షమార్హుడ్ని కాననిపిస్తుంది
అమ్మా!
నీకు తెలియకుండా
పెంచి పోషించుకున్న మృగ లక్షణం నేను

4 comments:

  1. అవసరానికి ఔషదం లాంటి
    నీ మమతానురాగాల
    సాన్నిహిత్యం ను నిర్లక్ష్యం చేసినందుకు
    నేను క్షమార్హుడ్ని కాననిపిస్తుంది ..............prati koduku lo ilaanti maarpu raavaali adbhutam sir.

    ReplyDelete
    Replies

    1. అవసరానికి ఔషదం లాంటి .... నీ మమతానురాగాల సాన్నిహిత్యం ను నిర్లక్ష్యం చేసినందుకు నేను క్షమార్హుడ్ని కాననిపిస్తుంది ..............
      ప్రతి కొడుకు లో ఇలాంటి మార్పు రావాలి అద్భుతం సర్.

      అద్భుతం అంటూ ఒక చిక్కని స్పందన స్నేహాభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete
  2. thalli prema voka divya avushadam chaala baagunadi very nice meeku machi padamulu peduthunaaru greate

    ReplyDelete
    Replies

    1. తల్లి ప్రేమ వొక దివ్య అవుషదం .... చాల బాగున్నది వెరీ నైస్ మీరు మంచి పదములు పెడుతున్నారు .... గ్రేట్
      కలిగొట్ల వెంకట రత్న శర్మ గారు నా బ్లాగుకు మీకు హృదయపూర్వక స్వాగతం
      ఎంతో చక్కని అభినందన మీ ప్రోత్సాహక స్పందన
      ధన్యవాదములు!

      Delete