Thursday, May 8, 2014

అమూల్య రాగబంధం



నా అనుకున్న అన్నీ 
నన్నుతో సహా 
ఇచ్చేసాను నీకు 
ఇంకా ఇచ్చేందుకు ఏమీ మిగలనంతగా 
అయినా 
నీ కళ్ళలో బాధే ప్రకాశిస్తుందెందుకో 
  
ఎవరికైనా ఇచ్చేసావేమో 
దొంగిలించారేమో ఎవరైనా .... హృదయాన్ని 
నా ఎద, మది మాత్రం 
నీ వద్దే 
పంచుకునేందుకు దాచుకునేందుకు నావద్దంటూ 
ఏమీ దాచుకో లేదు .... నా కోసం

నిన్ను గుండెలను 
గాఢంగా హత్తుకుని ముద్దాడాలనుంటుంది
కానీ ఏ ప్రతిస్పందననూ పొందలేక
వొదిలెయ్యాల్సొస్తుంది 
మరింత గాఢంగా దగ్గరకు లాక్కోవాలనే 
ఉద్వేగాన్ని దూరంగా నెట్టేసి .... మరీ
  
నీ గొంతు ద్వని లో 
బాధే వినిపిస్తూ ఉంది.
కేవలం నిశ్శబ్దమే ప్రతిద్వనిస్తూ ఉంది. 
వెన్నంటి వున్నట్లు .... నీడలా 
చీకటిలో నిలబడి 
ఎదురుచూస్తున్న రాగబంధం లా .... చెలీ

2 comments:

  1. తన ప్రతి ఫీల్ ఇచ్చినా ఇంకా ఏదో ఇవ్వలేకపోయానే అనే అనుమానం అతనిలో నే ఉంది.
    కవిత మొత్తం చదివితే తాను పడే తపన ఆమే ,ఆమె కోసమే అనేది తెలుస్తుంది,
    కానీ ఆతనిని అంటుకొనే ఉన్న బాద మాత్రమే అది.

    ReplyDelete
    Replies
    1. తన ప్రతి ఫీల్ ఇచ్చినా ఇంకా ఏదో ఇవ్వలేకపోయానే అనే అనుమానం అతనిలో నే ఉంది.
      కవిత మొత్తం చదివితే తాను పడే తపన ఆమే,
      ఆమె కోసమే అనేది తెలుస్తుంది, కానీ
      అది ఆతనిని అంటుకొనే ఉన్న బాద మాత్రమే అనిపిస్తుంది.

      చక్కని విశ్లేషణాత్మక స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు ఫాతిమా గారు!

      Delete