Friday, May 16, 2014

కాదనవు కదూ!




పిల్లా!
ఆ రోజు వస్తే ....
నేను, నీవద్ద సెలవు తీసుకునే రోజు
నిజంగా నీవు విలపించవు కదూ
ఆ రోజు వస్తే
నేను, అలసి ఆకశ్మికంగా మరణించిన రోజు
నిజంగా .... నా కోసం


పిల్లా! 
ఆ రోజు వస్తే ....
నేను, నీతో చెప్పేసిన రోజు 
నిన్ను నేను అపరిమితంగా ప్రేమిస్తున్నా అని 
తొలి పరిచయం నాడే 
నిజంగా .... నీవు నన్ను నవ్వుకోవు కదూ!?

పిల్లా! 
ఆ రోజొస్తుందా? 
కాలం దానంతట అది కదులుతూ 
ఈ సమాజం కోసం, నా కోసం .... నీవు
నా సుఖ సంతోషాలను కోరుకుని 
నవ్వుతూ వీడ్కోలు చెప్పే రోజు



పిల్లా! 
ఎందుకో అనిపిస్తుంది. 
నీవు, నేను ప్రేమించడం కన్నా మించి 
నీవు ప్రేమించే అతని కోసం 
అతని జీవితం లోకి లక్ష్మివై 
వెళ్ళాలని, ఎంతో బాగుంటుందని 

పిల్లా! 
తెలుసు! నా కోరికలు తీరవని 
నేను, నీకు ఏమీ కానని 
నీ కలలోకి రాలేనని తెలుసు 
అయినా, 
నిన్ను కల కనగలను. కాదనవు కదూ!

2 comments:

  1. పిల్లని అన్ని అడిగినా అది కూడా అందంగానే ఉంది చంద్ర గారు

    ReplyDelete
    Replies
    1. పిల్లని అన్ని అడిగినా
      అది కూడా అందంగానే ఉంది చంద్ర గారు

      ఒక అందమైన భావన స్పందన

      ధన్యవాదాలు మంజు (చెప్పాలంటే) గారు! శుభోదయం!!

      Delete