ఎవరైనా, ఏదో ఒక రోజు
చేరాల్సిన గమ్యాన్ని .... నేను
సాటి మనిషిని లా
ఎవరూ నన్ను మోసపుచ్చలేరు.
ఆనందం, ఉల్లాసం,
ఉన్నతశిఖర అధిరోహణలప్పుడు
ఎవరికీ నేను కానరాను.
కష్టాల వలలో చిక్కి
దిగులు సంద్రం లో
పీకలదాకా మునిగి,
ఎవరినైనా
వారు మోసం చేసిన నీడలే ....
వారి ఋణం తీర్చుకుంటున్నప్పుడు
నీడలా .... ఎదురుగా
చెయ్యందించేందుకు సిద్దమై
సమాధి లోంచి .... నేను,
సమాధిలోకి వారిని లాక్కుంటూ ....
ముందుగా
నేను లాక్కునేది మాత్రం
వారి శ్వాసనే!
బాధలనుంచి వారిని విముక్తుల్ని చేసేందుకు,
ఇంతకూ నేనెవరినో ఎవరికైనా తెలిసిందా?
మరణాన్ని .... శాశ్వతత్వాన్నని!
ఎవరైనా, ఏదో ఒక రోజు
ReplyDeleteచేరాల్సిన గమ్యాన్ని ....మరణాన్ని .... శాశ్వతత్వాన్ని .... నేను
అవును నిజమే చంద్రగారు.
ఎవరైనా, ఏదో ఒక రోజు
Deleteచేరాల్సిన గమ్యాన్ని ....మరణాన్ని .... శాశ్వతత్వాన్ని .... నేను
అవును నిజమే చంద్రగారు.
బాగుంది స్పందన ఆత్మీయాభినందన
ధన్యాభివాదాలు శ్రీదేవీ!
"
ReplyDeleteనీడలా .... ఎదురుగా
చెయ్యందించేందుకు సిద్దమై
సమాధి లోంచి .... నేను,
సమాధిలోకి వారిని లాక్కుంటూ ....
ముందుగా
నేను లాక్కునేది మాత్రం
వారి శ్వాసనే! "
చాలా గొప్పగా రాసారు చంద్ర గారూ
మీ భావాలు అలా అలా సునాయాసంగా
దొర్లిపుతున్నట్లుగా ..
మంచి కవిత ఇది
అభినందనలు చంద్ర గారూ .
*శ్రీపాద
"
Deleteనీడలా .... ఎదురుగా
చెయ్యందించేందుకు సిద్దమై
సమాధి లోంచి .... నేను,
సమాధిలోకి వారిని లాక్కుంటూ ....
ముందుగా
నేను లాక్కునేది మాత్రం
వారి శ్వాసనే! "
చాలా గొప్పగా రాసారు చంద్ర గారూ
మీ భావాలు అలా అలా సునాయాసంగా
దొర్లిపుతున్నట్లుగా .. మంచి కవిత ఇది
అభినందనలు చంద్ర గారూ .
ఒక మంచి స్నేహాభినందన ప్రోత్సాహక స్పందన
ధన్యాభివాదాలు శ్రీపాద గారు!