Thursday, May 1, 2014

నెమ్మదిగా చూస్తే




అకారణమేమో అనిపిస్తుంటుంది .... బాధ,
రోదించడం
ఏదీ భారం కానప్పుడు 
నేను ఒంటరిని కానని
ఈ భూమినేమీ నేను మొయ్యడం లేదని
నన్ను నేను నొప్పించుకోవడం ఎందుకని!?

చుట్టూ కట్టుకున్న కట్టుబాట్ల తాళ్ళను తెంపుకుని
ముందుకు కదిలితే ....
ఎన్ని అరుణోదయాలో, ఎన్ని కాంతి కిరణాలో
అడవిలో చెట్లు .... పూలు పూస్తూ
గాలి పలుకుల్ని వింటూ తలలూపుతుండటాలు  
వయ్యారంగా సాగరమే గమ్యంగా కదిలే నదులు
గర్వంగా తలలెత్తుకుని ఎదురయ్యే శిఖరాలు
పగలు నవ్వుతుందేమో అన్నట్లు ....

వేసిన అడుగు వెనక్కు తీసుకోని నాడు 
నీరసపడని నాడు
ఆశ ఉంది. గమ్యమూ ఉంది
పురోగమించితే ....
ముందుకు ముందుకు ముందుకే
స్వచ్చమైన స్నేహ అనురాగాల ప్రోత్సాహం
పరిశీలించి, విశ్లేషించి .... మరీ ఎదురొస్తుంది
చూసే కళ్ళలో బాహ్య ప్రపంచంలోనే ఉంది అందం అని

చివరికి అంతరంగంలోకి చూస్తే
లో లోతుల్లోకి
ఆలోచనలు అవగాహన
మది ఎదల సంతులనం
రాగయుక్తతను చూస్తే
అందంగా స్వచ్చంగా .... అక్కడ జీవితం
నవ్వు పలుకరింపులతో 
ఆనందం అనుభవమైన పరవశింపులతో .

No comments:

Post a Comment