Tuesday, May 27, 2014

సంపూర్ణత్వం కోసం




రెండవసారి అని తెలుసు ఈ కలయిక
పీటముడి .... నీకూ, నాకూ మధ్య 
నన్ను నమ్మడం నీకు కష్టమే 
కానీ తప్పదు.
భయమేస్తుంది కదూ!
సర్ధుకుంటాను.
ఒక మాటమీదే నిలబడుతాను.
నా తప్పు నేను సరిదిద్దుకుంటాను.

అశరీరవాణి చెబుతుంది. వినకు! 
గుండె బ్రద్దలవుతుంది. జాగ్రత్త! అని
ఒక్కసారి, 
ఈ ఒక్కసారి నా మాట విను!
భిన్నంగానే జరుగుతుందని.
ఇకనైనా
నీవూ నేనూ ఒకే కల కంటూ
ఒక గమ్యం దిశగా జీవించే సావకాశం అదిగో



నిజం పిల్లా! 
నీ ప్రేమస్వీకృతికి 
జీవన సాహచర్యానికి నేను
సిద్దంగా ఉన్నాను ఇప్పుడు.
నా ఈ మాటలు 
నా ఈ వేడుకోలు బ్రతిమాలటాలు
నాలో నేను మాట్లాడుకునే 
నా స్వగతం 
ఒంటరి మాటలు అనుకోకు.

ఇప్పుడు, మరోసారి 
ఒక్కటి కాబోయే ముందు 
నమ్మకం న్యాయం విడమర్చాలనే
ఇన్నాళ్ళూ అతిగా మాట్లాడిన నేను 
ఒంటరి రాతృల్లో 
నిన్ను .... బాధ, చీకటి అయోమయం 
అగమ్యగోచర సంఘటనల్లోకి తోసేసిన నేను 
ఇకపై
నీతో నిజాయితీగా ఉంటానని మాటిస్తున్నాను. 

ఓ పిల్లా! 
దయచేసి ఈ మాటలు శ్రద్దగా విను. 
నా అవసరాలు, జీవన ధర్మాలు 
నీతో ముడిపడి ఉన్నంతకాలం 
నేను నిన్ను ఒదిలివెళ్ళలేను. 
ఒదిలి వెళ్ళినా 
నీవు తిరిగి రానిస్తావని తెలిసినా
సహజీవన అవసరం, సంపూర్ణ తత్వం, నిజం ఇది! 

4 comments:

  1. ఒక్కసారి నమ్మకం పోగొట్టుకుంటే జీవితాంతం , మారానని చెప్పినా...మారినా ఏదో ఒక మూల అనుమానపు బీజం మొలకెత్తుతూనే ఉంటుంది.కొన్ని బంధాలు అంత సున్నితమైనవి మరి , వాటిని అంతే సున్నితంగా కాపాడుకోవాలి.చక్కగా వివరించారు చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. ఒక్కసారి నమ్మకం పోగొట్టుకుంటే జీవితాంతం, మారానని చెప్పినా....మారినా ఏదో ఒక మూల అనుమానపు బీజం మొలకెత్తుతూనే ఉంటుంది. కొన్ని బంధాలు అంత సున్నితమైనవి మరి, వాటిని అంతే సున్నితంగా కాపాడుకోవాలి.
      చక్కగా వివరించారు చంద్రగారు.

      చక్కని అభినందన బాగుంది స్పందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete
  2. నమ్మకమే పునాది ప్రేమకి అన్న భావం గోచరించేలా బహుచక్కగా అల్లారు కవితని.

    ReplyDelete
    Replies

    1. నమ్మకమే పునాది ప్రేమకి అన్న భావం గోచరించేలా బహుచక్కగా అల్లారు కవితని.

      ఏకీభావన స్పందన బాగుంది అభినందన
      ధన్యవాదాలు పద్మార్పిత గారు! సుప్రభాతం!!

      Delete