తన అవివేకానికి తను
మూల్యం చెల్లించుకున్నాను అని
అగ్నికి సర్వమూ కాలి బూడిదయ్యింది అని
అస్తిత్వం, అహంకారం లోలోనే దాచేసుకుని
ఏ మనిషైనా
పగిలిన హృదయానికి మరమ్మత్తు లేక
ఒంటరి నిరాశ నిస్పృహల జీవితం తో
అలా కాక
స్వీయ నమ్మకం పెంచుకుని,
కవితల ద్వారా బాధను కక్కి,
ఎద క్షతి అని
కారణాలు వెదికి విశ్లేషించి
తలచి, తలచుకుని, దేవదాసుగా మారడం మాని
తొందరపాటు గాయం మానేందుకు
నొప్పికి ఔషధం కోసం ప్రయత్నిస్తే
అనుకోలేము, అది భగ్నప్రేమ అని
తిరిగి ఎప్పటి లా మరో ఉదయం
నిరంతర జీవనయానం సాగిస్తూ
అవకాశాల వేటలో
జీవన సార్ధకత దిశ గా
వైవిధ్యం గా
వ్యక్తిత్వ నిర్మాణం చేసుకుంటూ వొటరిగానే అయినా
జిజ్ఞాసతో ముందుకు, ముందుకే సాగితే
ఆనందం, ఉపయోగం పనులు గమ్యం గా,
కదలడం చైతన్యించడం ప్రారంభించి,
"నేనే తను, తనే నేను .... కాకపోతే
జీవితం లేదు. జీవించలేను" అనుకున్న చొట
స్నేహమై పూసి ఎదురుపడ్డప్పుడు
కుశల పరామర్శలు, దూరంగా ఉన్నప్పుడు
శ్రేయోకాంక్ష, నిర్మల వాతావరణమే ఎదురయ్యేలా
జీవితాన్ని మలచుకుంటే
అప్పుడు
మానదు, ఏ ఎద శ్వాసించడం
మానవు, ఏ ప్రేమభావనలు పరిమళించడం
No comments:
Post a Comment