ఎందుకో తెలియదు. తగదనుకుంటూనే దగ్గరౌతున్నా
చేరువవ్వాల్సిన అవసరం లేదనిపించినా
తొలిచూపు ప్రేమను, తొలి పరిచయం ఆకర్షణను
ఎంతో పరిచయం ఉన్నదాని లా
ఎదురుపడే ఆ చిరునవ్వు ను, ఆ ప్రకాశాన్ని
ముఖం పై దాచుకోలేని ఆ ఉత్సుకత ను
కనపడనీయకుండా దాయాలనే ప్రయత్నం లో
ఆ పెదవి కొరుక్కోవడం లోని విపరీతార్ధాలను
ఆ విచలిత బలహీనతలను
ఎవరైనా గమనించారేమో అనే ఆ తడబాటు ను చూసి
ఆ నవ్వును, ఆ బలహీనతను నీలో చూసాను.
ఇంతకు ముందు నేనెప్పుడూ నిన్ను కలవలేదు.
నువ్వెవరివని నాకు తెలియదు
నీ ప్రాంతం, నీ పద్ధతులు నీ నడవడిక తొలిసారే నాకు.
అయినా, ఒక్కటి మాత్రం ఒప్పుకుంటాను.
నీ భావనల్ని సాహిత్యం గా మాత్రం చదివానని
నీ ముఖం నీ చిరునవ్వు
నీ కవితల్లో గమనించి ఆకర్షితుడ్నయ్యానని
నిజం! నేను, నిన్ను నీ సాహిత్యంలోనే చదివాను.
ఆ పరిశీలన ఆ దృష్టికోణం
ఆ విషయ పరిజ్ఞానం లో విజ్ఞతను చూసాను.
నీవు రాసిన భావనల పదరూపకల్పనలు
నిజం గా సమ్మోహనాశ్త్రాలే నీ లా
ఏదో తెలియని అందం ఆనందం నమ్మకం .... నీ నవ్వులో
పరిసరాల్ని తీవ్రం గా ప్రాభావితం చేసే శక్తిని చూసాను.
అందుకే ఆశిస్తున్నాను,
నీవు నన్నోసారి గమనించాలని, నన్ను చదవాలని,
నేను సమాజాన్ని చదవడంలో
సహకరించాలని .... నా భావావేశానికి అక్షర రూపం ఇవ్వడంలో
సర్, అద్బుతంగా ఉంది . ఓ కవి తన భావనలను తాను అభిమానించే ఓ అదృస్య భావనతో మొరపెట్టుకొవటం,
ReplyDeleteతాను ఎంత బాగా రాసినా దాని ప్రేరణ ఆ మూర్తిమత్వానిదే అనుకోవటమూ..,
ఒక్కటిమాత్రం నిజం మీ కవితలు పై,పైన చదవటం సాద్యం కాదు.
సర్, అద్బుతంగా ఉంది.
Deleteఓ కవి తన భావనలను తాను అభిమానించే ఓ అదృశ్య భావనతో మొరపెట్టుకొవటం,
తాను ఎంత బాగా రాసినా దాని ప్రేరణ ఆ మూర్తిమత్వానిదే అనుకోవటమూ....,
ఒక్కటిమాత్రం నిజం మీ కవితలు పై, పైన చదవటం సాద్యం కాదు.
అవునా! ఆకాశం లోకి విసిరేసారు. ఇక్కడినుండి క్రిందికి దిగే వైనం చెప్పి మరీ విసిరెయ్యండి ఇకపై. ప్రస్తుతానికి ప్రోత్సాహకర వ్యాఖ్య అనుకుంటాను. సంసిద్దుడ్ని గా ఉండాలిగా మరి .... తిరిగి మీలో ఒకడ్ని గా ఉండేందుకు.
మీ అభినందనకు ధన్యమనోభివాదాలు మెరాజ్ గారు!