ఆలోచనల మబ్బులు కమ్మి
కన్నీళ్ళ వర్షం కురవబోతుందనే
అనుభూతి ....
కానీ,
తుళ్ళి పడాల్సిన బాధ
కనుల అంచుల్లోనే ఆగి పొడిబారి
కరుస్తున్నట్లు
దురద
అర్ధరహిత భావనలు కోరికల
కొండి లు
మదిలో గుచ్చుకున్న పీడ
ఆశాభంగం పిదప
మరిచిపోలేని భావోద్వేగాల
రాని కన్నీళ్ళ ఊట....
తుడుచుకుంటున్న
అనిర్వచనీయ అసంతృప్తి
ఆ అసంతృప్తి లోనే ....
తెలియని ఆశ, అనవరతమూ నీడలా
ఎదురవుతున్న నీవు లా
నిన్ను చూసి
నీలోని నిర్మలతను
నీ పెదవులపై
ఆ చిరునవ్వు వికసించిన
పరిమళం చూసి నా కోసమే అనుకుని
ఆశనిరాశల దోబూచులాట బాగుంది చంద్రగారు.
ReplyDeleteఆశనిరాశల దోబూచులాట
Deleteబాగుంది చంద్రగారు.
బాగుంది అభినందన స్పందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!
అందని ఆశల హరివిల్లు ఊహల్లో చాలా అందంగా అగుపిస్తుంది.
ReplyDeleteఅందని ఆశల హరివిల్లు
Deleteఊహల్లో చాలా అందంగా అగుపిస్తుంది.
చక్కని పరిశీలన స్నేహ ప్రోత్సాహక స్పందన
ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభసాయంత్రం!!
కన్నీళ్ళ ఊటని ఆస్వాదించే అనూహ్య భావం.
ReplyDeleteకన్నీళ్ళ ఊటని ఆస్వాదించే
Deleteఅనూహ్య భావం.
భావనల లోతుల్ని విశ్లేషిస్తూ ప్రోత్సాహక అభినందన, స్పందన
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభసాయంత్రం!!