చూరు క్రింద
పక్క నుంచి కదులుతూ
ఈదురు గాలి అలజడి
నన్ను .... ఒళ్ళంతా తడిమి
నా శ్వాసలో ఒక భాగమై
విలీనమై
వీడ్కోలు వేళలో
చిరు చౌర్యం
నా తెలివి
నా బద్దకం
నా స్వేదం దొంగిలించి
సాగరం లో పోటులా
ఆ ప్రవాహం కాడలు విస్తరించి
నన్ను మాత్రం
స్థిరంగా ఉంచుతూ
కాలం చూరు క్రింద
కాలం చూరుకింద నన్ను మాత్రం పదిలంగా ఉంచుతూ..,
ReplyDeleteచక్కటి ప్రయోగం సర్.
కాలం చూరుకింద నన్ను మాత్రం పదిలంగా ఉంచుతూ....,
Deleteచక్కటి ప్రయోగం సర్.
బాగుంది స్పందన అభినందన
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!