తడబడుతుంటాను.
చిద్రమైపోతుంటాను .... మాట్లాడాల్సొచ్చిన ప్రతి సారీ
ఏడుస్తాను లోలోపల ....
మనసు భావనలను మాటలు లా పలుకలేక .... నత్తి తో
............
అక్షరమేదో పంజాలా నా గళంపై దాడి చేసినట్లు
పదాలు, పదబంధాలు
బిగుసుకుపోయిన గొంతులోంచి
కక్కి, దగ్గిన పదాలు అనర్ధవంతమవుతూ
...........
మదిలోంచి పళ్ళవరకూ వచ్చినట్లు వచ్చి
నైజాన్ని కోల్పోయి .... ఆగిపోయిన శబ్దం
పదం లో 'త ' అనే అక్షరం
గుండె లో ధమని వద్దే కొట్టుకుంటూ
.............
నాలో బాధ వినేవారికి ఆశ్చర్యం గా పరిణమించి
తల్లి, తండ్రి, తమ్ముడు
కేవలం 'త ' అనే అక్షరం
గొప్ప విషాదం 'త ' ను పలుకలేకపోవడం .... నేను
No comments:
Post a Comment