Sunday, May 4, 2014

ఏదో అవుతుందని తెలుసు .... కానీ
















వ్యక్తిత్వం అస్తిత్వం చేజారి పోతూ  
నాలో 
నిరంతరం ఒత్తిడి 
పేగు గోడల్లో రసాయనాలు స్రవిస్తూ .... ఆకలి

చుట్టుకుని పడుకునుండాల్సిన పాము 
తోకమీద నిలబడ్డట్లు 
ఆకలి పేగులు 
ఆవేశం విషం తో కాటేస్తానికి సిద్దంగా

గుండె ఆరాటం 
కనురెప్పలక్రింద సర్ధుకుని, నీరై ప్రవహించని 
బాధ లో తియ్యదనం 
కన్నీటి లో వెచ్చదనం కసిగా మారి ఆవిరై పోతూ

8 comments:

  1. మానసిక ఓదార్పు, మలినం లేని భావన కవిత చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మానసిక ఓదార్పు, మలినం లేని భావన
      కవిత చాలా బాగుంది.

      స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన బాగుంది
      ధన్యాభివాదాలు మెరాజ్ గారు! శుభ ఉషోదయం!!

      Delete
  2. ఆకలి అక్రోశానికి అక్షర రూపకల్పనిచ్చారు...బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. ఆకలి అక్రోశానికి అక్షర రూపకల్పనిచ్చారు...
      బాగుందండి.

      బాగుంది స్పందన ప్రోత్సాహక అభినందన
      ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభోదయం!!

      Delete

  3. " గుండె ఆరాటం
    కనురెప్పలక్రింద సర్ధుకుని, నీరై ప్రవహించని
    బాధ లో తియ్యదనం
    కన్నీటి లో వెచ్చదనం కసిగా మారి ఆవిరై పోతూ.."

    ఆవేదనా భరితమైన కవిత ఇది.
    మనోభావాలని సున్నితంగా వ్యక్తీకరించారు చంద్ర గారు.
    అభినందనలు
    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. "గుండె ఆరాటం
      కనురెప్పలక్రింద సర్ధుకుని, నీరై ప్రవహించని
      బాధ లో తియ్యదనం
      కన్నీటి లో వెచ్చదనం కసిగా మారి ఆవిరై పోతూ.."

      ఆవేదనా భరితమైన కవిత ఇది. మనోభావాలని సున్నితంగా వ్యక్తీకరించారు చంద్ర గారు. అభినందనలు

      చాలా బాగుంది స్నేహ ప్రోత్సాహక అభినందన స్పందన
      ధన్యాభివాదాలు శ్రీపాద గారు!

      Delete
  4. ఆకలి ఆక్రోశాన్ని బాగా వివరించారు, బాగుంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. ఆకలి ఆక్రోశాన్ని బాగా వివరించారు,

      బాగుంది చంద్రగారు.

      బాగుంది స్పందన అభినందన
      నమస్సులు శ్రీదేవీ!

      Delete