Monday, May 19, 2014

ప్రేమాగ్ని




నిన్ను ప్రేమించాలనుంది 
చవిచూడాలనుంది. తొలి ప్రేమ మాధుర్యాన్ని 
చేతులు బార్లా చాచి, హృదయ ద్వారాలు తెరిచి 
తారలు నక్షత్రాలు చేరిన 
నూతన అనుభుతిని పొందాలని .... నీతో 

సందేహాలకు తావు లేని 
నిర్భయ, నిష్కల్మష మానసంతో 
ఇంతకు పూర్వం ఎవ్వరూ కట్టని బలమైన గోడొకటి కట్టాలని 
అందుకై సర్వస్వం కోల్పోయేందుకు సిద్దమై .... మరీ 
ప్రేమ కోవెల వొకటి కట్టాలని ఉంది


నా మనోభీష్టం లక్ష్యంగా 
ఏమి పొందాలనుకుంటున్నానో .... అందుకోసం 
నిస్వార్ధం గా, నన్ను నేను సమర్పించుకుని 
భావనలకు సాన్నిహిత్యంగా 
జీవించుదామని .... నీ ప్రేమ సాంగత్యం లో

నీ, నా పరిచయం .... అవి తొలిచూపులే అన్నట్లు
ఇలలో తొలిప్రేమ మనదనే, తుది నిర్ణయం లా 
నీవు నన్ను ఎలా ప్రేమించాలని కోరుకుంటున్నానో .... అలా 
నన్ను నేను సంసిద్దుడ్ని గా శిక్షణ ఇచ్చుకుంటున్నా
నిన్ను ప్రేమించాలని అగ్నిలా

2 comments:

  1. నీవు నన్ను ఎలా ప్రేమించాలని కోరుకుంటున్నానో .... అలా
    ఇది ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన గొప్ప విషయం.
    చాలా బాగుంది చంద్రగారు.

    ReplyDelete
    Replies
    1. నీవు నన్ను ఎలా ప్రేమించాలని కోరుకుంటున్నానో .... అలా
      ఇది ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన గొప్ప విషయం.
      చాలా బాగుంది చంద్రగారు.
      బాగుంది విశ్లేషణాత్మక స్పందన, ప్రోత్సాహక అభినందన
      నమస్సులు శ్రీదేవీ!

      Delete