Thursday, May 15, 2014

పరిణతి ప్రేమ




సౌలభ్యం, అనుకూలత, సున్నితత్వమూ
కలిసి
ఏర్పడే ఇష్టం ప్రేమ
ఉదయం గాలి లో స్వచ్చత
తాజా
నిర్మలత్వం ప్రేమ
ఒకరు ఇంకొకరికోసం
అస్తిత్వం కోల్పోవాలనుకునే
త్యాగం ప్రేమ
అది
నేను నీలో
కనుగొన్నాను.
వేసవి ఉదయం
సూర్యోదయ వేళల్లో రాలే
మంచు బిందువుల ఆస్వాదనాన్ని
గులాబీ మొగ్గ లా .
తప్పకుండా
పల్లవించే పరిమళాన్ని.
సతతహరితం
అమరం
మన ప్రేమ
రెండును
రెండు విధాలుగా
చూడలేని రెండు హృదయాల సమ్మేళనం
నీవూ నేనూ
మన ప్రతి భావన లోనూ నూతనత్వం
ఆరంభతత్వం గా
తొలిఉదయం
తొలిరాత్రి
తొలిప్రేమ లా ఎప్పుడూ
మన ఆత్మలు
ఆనందోల్లాసాలతో
నర్తించుతూ
ఆ ఉద్వేగం
ఆ వెచ్చదనం
ఆ ఆవేశం అలౌకిక భావనలో
ఆ మృదు మనోజ్ఞ
మనోహర
వికాసం ప్రజ్వలిత ప్రకాశం లో
రెండు జ్యోతులు
ఒక్కటై
ప్రకాశిస్తున్నట్లు



రెండు చూపులు
ఒకే గమ్యాన్ని
చూస్తున్నట్లు
సూర్యోదయ
ప్రాభవం
కీర్తి ప్రేమ,
అర్ధరాత్రి సూర్యుడి చైతన్యం ....
సమ్మిళితమైన క్షణాల
పరిపూర్ణత్వం ప్రేమ
కాలపురుషుడు మార్చలేని
అర్ధవంతమైన అమరత్వం
సతతహరితత్వం ప్రేమ

No comments:

Post a Comment