Saturday, May 17, 2014

అమృతమూర్తిని చూస్తున్నాను .... నీలో




రేకులు రాలి దుమ్ముకొట్టుకుపోయి అవనతనైన గులాబీని లా నేను
సంరక్షణ లేని తోట లో కొన ఊపిరితో
మరి కొద్ది క్షణాల్లో ప్రాణం కోల్పోబోతున్నవాడిలా .... నా కళ్ళలోంచి
ఉండుండి జారుతూ .... ఒక్కొక్క రక్తం బొట్టు, నేను
ఒక పగిలిన హృదయపు అవశేషాన్ని, ఒక ఒంటరి ఆవేదనను.

నాకు వరమిస్తానికే దిగి వచ్చిన అమృతమూర్తివి లా
ఏ రంగుహంగుల్లేని రెక్కల దేవత, స్వేచ్చా సంచారిణివి లా
ఏ దివి నుంచో వచ్చి .... నీవు, పెళుసై పగిలిన నా హృదయాన్ని
స్పర్శించేందుకు, గమనించేందుకు
నాకు గుర్తులేని పసితనం మది పొరల్లో శిధిలమైన నా జ్ఞాపకాల ను

మరీ అంత సమీపం లోకి వస్తావనుకోలేదు. నా సమశ్యల సెగ
ఆ వేడి, ఆ బాధల అనుభూతి తగిలినట్లుంది.
గుంటలు పడి ప్రాణం కోల్పోతున్న కళ్ళ లోకి చూసి
ఆవిరైపోయిన కన్నీటి పగుళ్ళ ఎర్ర జీరలు
రాలని రక్తాశృవుల చారలను .... తుడిచే సాహసం ప్రయత్నం చేసావు




ఆ దివి దిగి వచ్చిన దేవతవనుకోను .... అమృతమూర్తి అమ్మవే అనుకుంటాను.
నా నుదిటి పై ఒక సున్నితమైన ముద్దును ఇచ్చావు చూడు .... వరంగా, అప్పుడు
క్యాన్సర్ పుండ్లుగా మారిన నా అంతర్గత గాయాలు ఆ క్షణం లో నే మానినట్లై
తిరిగి ఏదో నూతన ప్రకాశం, ఒక నూతన చైతన్యం
కొత్త అనుభూతులకు స్థానం ఏర్పడి .... వింత వెలుగులు నా కళ్ళలో

2 comments:

  1. pagilina hrudayaanni kudaa premaamrutamto nimpe mi kalam nunchi jaaluvaarina ii bhaavaalu chaalandi ....chaalaa chaalaa baavundi

    ReplyDelete
    Replies
    1. పగిలిన హృదయాన్ని కూడా ప్రేమామృతంతో నింపే మీ కాలం నుంచి జాలువారిన ఈ భావాలు చాలండి ....చాలా చాలా బావుంది
      చాలా చాలా బావుంది ప్రత్యేకంగా అభినందన, స్నేహ ప్రోత్సాహక స్పందన
      ధన్యవాదాలు మంజు యనమదల గారు! సుప్రభాతం!!

      Delete