Friday, January 31, 2014

అశృవులు ....?
















అవి ఆనందాశృవులో, దుఃఖాశృవులో
వర్గీకరించగలిగితే,
కారణం .... వరమో, శాపమో
ఆనందమో, అనర్ధమో అవగతమైతే బాగుండేది!?
నోరు లేని మూగ జీవి
కళ్ళ
పొడి కన్నీటి చుక్క ఒకటి
నన్ను ప్రశ్నించింది.
సమాధానం తెలియక, నేను
తలొంచుకుని
బయటికి కదిలాను .... ప్రశ్నకు దూరంగా.

6 comments:

  1. ఆ అశ్రువు కు ఎన్ని వ్యదలో... ఎన్ని అర్దాలో.
    ఆత్మీయులు మాత్రమే చెప్పగలరు.

    ReplyDelete
    Replies
    1. ఆ అశ్రువు కు
      ఎన్ని వ్యదలో ....
      ఎన్ని అర్దాలో.
      ఆత్మీయులు మాత్రమే చెప్పగలరు.

      అవును నిజమే! ఆత్మ కు సన్నిహితంగా ఉన్నవారే చెప్పగలరు
      బాగుంది స్పందన స్నేహ ఆత్మీయాభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ గారు! శుభోదయం!!

      Delete
  2. Chandra gaaru chalaa baagundi:-):-)

    ReplyDelete
    Replies
    1. చంద్ర గారు చాలా బాగుంది

      ఎగిసే అలలకు వేముల చంద్ర స్వాగతం
      చాలా బాగుంది స్పందన అభినందన
      _/\_లు కార్తీక్ గారు! శుభోదయం!!

      Delete
  3. ఆప్యాయమైన స్పర్శ అందించు ,అశ్రువు తనంతట తానే చెబుతుంది...తన రాక కారణమేమిటో .

    ReplyDelete
    Replies
    1. "ఆప్యాయమైన స్పర్శ అందించు, అశ్రువు తనంతట తానే చెబుతుంది .... తన రాకకు కారణమేమిటో ...."
      ఆప్యాయతకూడిన స్పర్శకు తెలుస్తుంది .... అది దుఃఖమో ఆనందమో
      బాగుంది స్పందన స్నేహాభినందన
      నమస్సులు శ్రీదేవీ!

      Delete