నాలోని విశిష్టతలను
గుమ్మరిస్తున్నా ఇక్కడ
నీ ముందు
ఈ అక్షరాల్లో ....
ఈ కలయబోసిన నవ్వులు
ఈ కన్నీళ్ళు
ఈ నలిగిన గుండె రోదనలు
ఈ ఎదురుదెబ్బల జీవితానుభవాలు
ఈ సంతోషం పులకరింపులు
కొవ్వు .... ముఖం మాస్క్ కింద
దాచేసుకున్నా భద్రం గా,
నా ప్రేమను
సంరక్షించుకోవడానికి
ఈర్ష్యతో నిండిన కనులకు
సమాజం కట్టుబాట్లకు .... దూరం గా,
నీ ముందు
ReplyDeleteఈ అక్షరాల్లో ....
ఈ కలయబోసిన నవ్వులు
ఈ కన్నీళ్ళు
ఈ నలిగిన గుండె రోదనలు...వావ్
"నీ ముందు
Deleteఈ అక్షరాల్లో ....
ఈ కలయబోసిన నవ్వులు
ఈ కన్నీళ్ళు
ఈ నలిగిన గుండె రోదనలు .... వావ్" ....
ఒక చక్కని స్పందన బాగుంది స్నేహాభినందన
ధన్యవాదాలు పద్మార్పిత గారు! శుభ ఉషోదయం!!