Thursday, January 16, 2014

నా ప్రేయసి గదిలో గోడకు వ్రేలాడుతూ నేను



 













గాలి లేదు. ఉక్కబోస్తుంది. శ్వాసించలేకపోతున్నాను.
భయంకరమైన నిశ్శబ్దం ఏదో నా ప్రపంచాన్ని తడుముతూ
అక్కడ .... గోడకు కొట్టిన మేకుకు వ్రేలాడుతూ
ఫొటో ఫ్రేం లో తీవ్ర కంపనకు లోనౌతూ, అలజడి చెందుతూ .... నేను,
నా ఫొటో బయట వాతావరణం మాత్రం అచేతనత్వమే అంతా.

నిశ్చలంగా, ఒంటరినిగా కొన్నాళ్ళుగా అక్కడ .... జీవిస్తూ,
నేనూ, నాలా పక్కనే మరో ఫ్రేముల్లో మరికొందరు.
నాకు వారు తెలియరు. వారికెవరికీ నేను తెలియను.
నా పేరు .... నాకూ, నా ప్రేయసికి మాత్రమే తెలుసు
ఇసుక లో రాసుకునున్నాము .... ఒకరిపేర్లొకరం కనుక,

ఒక్కసారి అనుకుంటాను .... ఒకే ఒక్కసారి
ఫొటో ఫ్రేము లోంచి .... గాలికి, భూమ్మీదకు రాలి పడాలని
ఒంటరిగా కూర్చునున్న .... నా ప్రేయసి ఒడిలోకి జారి సేద దీరాలని
ఆమె నోట నా పేరును వినాలని .... ప్రయత్నించి, భంగపడి
మరింత బలంగా గోడనున్న మేకుకు ఉరేయబడ్డాను.

4 comments:

  1. ఒకరిపేర్లొకరం కనుక...
    ప్రయత్నించి, భంగపడి
    మరింత బలంగా గోడనున్న మేకుకు ఉరేయబడ్డాను...

    చక్కగా కట్టబడిన ఫ్రేం...
    అందమైన నగిషీలు...
    అభినందనలు...

    ReplyDelete
    Replies
    1. నా పేరు .... నాకూ, నా ప్రేయసికి మాత్రమే తెలుసు
      ఇసుక లో రాసుకునున్నాము .... ఒకరిపేర్లొకరం కనుక...
      నా ప్రేయసి ఒడిలోకి జారి సేద దీరాలని
      ఆమె నోట నా పేరును వినాలని .... ప్రయత్నించి, భంగపడి
      మరింత బలంగా గోడనున్న మేకుకు ఉరేయబడ్డాను...

      చక్కగా కట్టబడిన ఫ్ర .... అందమైన నగిషీలు .... అభినందనలు

      చక్కని స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు ఎన్ ఎం రావు బండి గారు! శుభోదయం!!

      Delete
  2. పాపం ! నిజజీవితంలోనూ ఒడిలో సేద తీరలేక , కనీసం ఫోటో ఫ్రేముగానూ ఒడిలో చేరుకోవడంలో విఫలమయ్యి కడకు అదే మేకుకు గట్టిగా ఉరివేయబడడం నిజంగా దారుణం.....కానీ ఇంకా ఫోటో రూపంగానైనా ఇంటిలో ఉంచుకుంది సంతోషం ..గోడ మీద జానెడు చోటు దొరికింది ఆనందించు......గాలికెగిరి కిందపడి ఫ్రేము విరిగి మూల పారేస్తే మాత్రం చేసేదేముంది , కనుక అంతటితో సంతోషించి మేకుకు వేలాడు మాట్లాడకుండా ....చంద్రగారు కవిత బాగుంది ఫొటోలో కూడా ప్రేయసిని ఆరాధిస్తూ....

    ReplyDelete
    Replies
    1. పాపం ! నిజజీవితంలోనూ ఒడిలో సేద తీరలేక, కనీసం ఫోటో ఫ్రేముగానూ ఒడిలో చేరుకోవడంలో విఫలమయ్యి కడకు అదే మేకుకు గట్టిగా ఉరివేయబడడం నిజంగా దారుణం.....
      కానీ, ఇంకా ఫోటో రూపంగానైనా ఇంటిలో ఉంచుకుంది సంతోషం పడండి .... గోడ మీద జానెడు చోటు దొరికింది ఆనందించండి .... గాలికెగిరి కిందపడి ఫ్రేము విరిగి మూల పారేస్తే మాత్రం ఏమి చెయ్యగలరు కనుక?, కనుక అంతటితో సంతోషించి మేకుకు వేలాడండి మాట్లాడకుండా .... చంద్రగారు

      కవిత బాగుంది ఫొటోలో కూడా ప్రేయసిని ఆరాధిస్తూ....,

      స్పందన బాగుంది అక్కడక్కడా చిరు చురకల స్నేహాభినందనై
      ధన్యాభివాదాలు శ్రీదేవీ!

      Delete