Saturday, January 25, 2014

ఎప్పుడైనా



 








ఎప్పుడైనా ఎక్కడైనా ....
స్త్రీ కంట తడిపెడితే, విలవిలా ఏడిస్తే 
ఆ ఇంటికి సుఖశాంతులు ఉండవు.
ఆ ఏడుపు తుఫానైతే, పరిసరాలు మసకేసి పోతే
ఎలా అనునయించాలో తెలియకపోతే 
ఏమీ మాట్లాడకు.
ఆమె గుండె చల్లారేవరకూ రోదించనీ

ఏ నిజమూ, ఏ అబద్దమూ
ఆ క్షణం లో ఆమె బాధను తగ్గించలేవు.
అర్ధం చేసుకున్నవాడిలా ....
మౌనంగా ఆమెను దగ్గరకు తీసుకుని
ఒక నేస్తం లా ప్రేమగా
నీవున్నాననే నమ్మకం కలిగించగలవే కాని.

ఆ ప్రకృతే విలపిస్తే
వరదై, తుఫానై విషాదగీతం పాడితే,
ఎంతటివారికైనా తలొంచుకోక తప్పదు. 
క్రమశిక్షణతో సంబాళించుకోక తప్పదు.
వాతావరణం కుదుటపడి
ఉదృతి చల్లారి ప్రశాంతతను చూడాలనుకుంటే
పరిస్థితులను ప్రేమగా స్వీకరించక తప్పదు.



 





ఎప్పుడైనా నీ భార్యా మణి కంట తడిపెడితే
కాలయాపన చెయ్యకు .... ఆలోచిస్తూ 
ఏమి చెబితే బాగుంటుందని, ఎలా నమ్ముతుందని
ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి
కొంతైనా బాధ .... ఉపశమనం గా మారేవరకూ
నిండుమనసు తో దగ్గరకు తీసుకో .... చాలు.



 






ఎప్పుడైనా ముంగిటి లో స్త్రీ ఏడిస్తే, కంటతడిపెడితే
శుభసూచకం కాదు. కలలు కుప్ప కూలిపోతాయి.
కన్నీరు ఉప్పెనగా మారి ప్రశాంతత కోల్పోతావు.
నీ గుండె బ్రద్దలౌతుంది. 
అప్పుడే, నీకు అర్ధం అవుతుంది.
ప్రేమగా పొదువుకుని, ఆమెకు నమ్మకం కలిగించాలని 
తోడుగా నీవున్నావని .... నీవూ రోదిస్తున్నావని.  

6 comments:

  1. చాలా బాగా చెప్పారు చంద్రగారు ఏవిధంగా నమ్మకం కలిగించాలో.

    ReplyDelete
    Replies
    1. చాలా బాగా చెప్పారు చంద్రగారు ఏవిధంగా నమ్మకం కలిగించాలో.
      చాలా బాగుంది స్పందన ఒక స్నేహ ప్రోత్సాహక అభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ!

      Delete
  2. ఆడదాని మనసు కడలి లాటిది. దానిలోని అలల ఉద్ధృతి మాత్రమే చూడగలుగుతున్నారు గానీ తీరాన్ని చేరే స్వచ్చమైన తెల్లని నవ్వు నురుగులనీ చూడలేరు లోపలి పొరల్లో దాచుకున్న అనంత సంపదను చూడలేరు సొంతం చేసుకోలేరు. మీ కవిత చాలా బాగుంది చక్కని దారి చూపారు

    ReplyDelete
    Replies
    1. ఆడదాని మనసు కడలి లాటిది. దానిలోని అలల ఉద్ధృతి మాత్రమే చూడగలుగుతున్నారు గానీ తీరాన్ని చేరే స్వచ్చమైన తెల్లని నవ్వు నురుగులనీ చూడలేరు. లోపలి పొరల్లో దాచుకున్న అనంత సంపదను చూడలేరు. సొంతం చేసుకోలేరు.
      మీ కవిత చాలా బాగుంది. చక్కని దారి చూపారు.
      చక్కని స్పందన చాలా బాగుంది అభినందన
      ధన్యాభివాదాలు హరిత గారు!

      Delete
  3. సర్, ఇలా ఆలోచించగలిగే మీ సంస్కారం చాలాగొప్పది,
    మీరన్నట్లు స్త్రీని (ముఖ్యంగా అర్దాంగిని ) నేనున్నానని ఓదార్చగల వారే నిజమైన తోడు.

    ReplyDelete
    Replies
    1. సర్, ఇలా ఆలోచించగలిగే మీ సంస్కారం చాలాగొప్పది, మీరన్నట్లు స్త్రీని (ముఖ్యంగా అర్దాంగిని ) నేనున్నానని ఓదార్చగల వారే నిజమైన తోడు.
      చక్కని విశ్లేషణ ఏకీభావన స్నేహాభినందన స్పందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete