Wednesday, January 15, 2014

ఓ పిల్లా .... నీకే చెబుతుంది!



 











ఒక అతను
ఒక నీకు మనసిచ్చి మనువాడవచ్చి చేరువై
దగ్గరకు లాక్కుని "నిన్నే ప్రేమిస్తున్నా!" అని
నీ ఇంటికి సరళంగా దారి అడిగితే,
ఓ పిల్లా! అనుమానించకు!

"నేను నీకోసము, నీవు నాకోసమే పుట్టాము!" అనే
అర్ధమూ ఉండొచ్చు ఆ మాటల్లో .... అలోచించు.
అతని మనసు, ప్రపంచం అంతా నీవే అయి,
ఫంచభూతాల్ని ప్రతిగా నీకు సమర్పించేందుకు సిద్దమేమో ....
నీ అనురాగం పొందడం కోసం!

అతను ప్రేమలో మంచిని మాత్రమే చూస్తాడు.
ప్రియురాలు మంచిని మాత్రమే తలుస్తుందనే నమ్మకం ప్రబలమై
ఎవరైన ఆప్త మితృడు
చెడు లక్షణాలను చూపే ప్రయత్నం చేస్తే
ఆ మిత్రతనైనా ఒదులుకునేందుకు సిద్దపడే అంత ప్రేమిస్తాడే కానీ,

ఓ పిల్లా నిజం! నిజంగా అతను నీకు మనసిస్తే,
నీ కోసం తనను ఖర్చు చేసుకుంటాడు.
అన్ని జీవన సౌకర్యాలను వొదులుకుంటాడు.
వర్షంలో తడుస్తాడు. ఆరు బయట .... పవళిస్తాడు.
ఒకవేళ నీవు ఆనందిస్తావనుకుంటే .... మంచులోనైనా సరే,





 












పిల్లా అదీ ప్రేమంటే!
నీ కోసం బికారి అయ్యేందుకు ఇష్టపడటం.
నిన్ను మించిన విలువైనదేదీ లేదు ఈ ప్రపంచం లో అనుకోవడం
అందుకే పిల్లా! ప్రేమనెప్పుడూ చులకనగా చూడకు
అతని అంతరంగం ఆత్మ అలజడి చెందేలా నడుచుకోకు!

నీవు తలచుకుంటే
అతని జీవితం లో అల్లకల్లోలం సృష్టించగలవు.
అతన్ని పిచ్చివాడిలా ఆడుకుని
అతని ఊహకు రాని భావనల చేష్టలతో పిచ్చివాడ్ని చేసి
పరిణామం చివరికి మాత్రమే అతనికి తెలిసేలా చెయ్యగలవు.

పిల్లా! అతను చెబుతుంది నీతోనే "నిన్నే ప్రేమిస్తున్నా! అని"
నీకు సర్వం సమర్పించుకునేందుకు సిద్దంగా ఉన్నాను అని,
అతన్నీ, అతని వారసత్వ సంపద నూ
నీ ప్రేమను పొందడం కోసం .... నీ కోసం,
నీతో జన్మజన్మల బంధం ఏర్పరచుకోవడం కోసం






 











పిల్లా! అతన్ని అలా నీవు పిచ్చివాడు, గుడ్డివాడు గా చూడకు!
చెడుగా భావించకు! అతనే కావాలని కోరుకో!
అవును పిల్లా!
మనసారా ప్రేమించిన నీకు అతను ఎలాంటి చెడూ చెయ్యలేడు.
మరో స్త్రీ వైపు కన్నెత్తి చూడడు. ప్రేమిస్తున్నాను అని చెప్పి నీవు పారిపోతే తప్ప!

పిల్లా! ఓ పిల్లా! ఇది పురుష ప్రపంచం కాదు.
స్త్రీ కి సమాన హక్కులు కోసం పురుషుడు పోరాడాల్సిన ప్రపంచం!
ప్రేమ ప్రపంచం .... ఓ పిల్లా! మార్పు నీ ముందే ఉంది.
నిన్నటి పురుష సమాజం రేపటి స్త్రీ, పురుష సమాజం అయ్యేందుకు.
పిల్లా! ప్రేమతోనే సాధ్యం అంతా!

4 comments:

  1. అబ్బో ! మీ పిల్లాడు ఎంత మంచివాడు చంద్రగారు...అందరూ అంత మంచివాళ్ళయితే అమ్మాయిలకు అంతకన్నా పండుగ ఏముంటుంది చెప్పండి .

    ReplyDelete
    Replies
    1. "అబ్బో! మీ పిల్లాడు ఎంత మంచివాడు చంద్రగారు .... అందరూ అంత మంచి వాళ్ళయితే అమ్మాయిలకు అంత కన్నా పండుగ ఏముంటుంది చెప్పండి .... "

      భావనాత్మక వ్యక్తిత్వాలే సమాజం లో ఉంటే ఎంత బాగుణ్ణు అని విశ్లేషణాత్మక స్పందన
      ధన్యాభివాదాలు శ్రీదేవీ! శుభోదయం!!

      Delete
  2. వ్యర్ద ప్రయత్నాలు మానుకోవాలి, పిల్ల(ఈ కాలం) చాలా తెలివైనది,
    అయినా కొన్ని పరీక్షలను పెట్టి, సెలక్ట్ చేస్తుంది.
    అయినా ఇదేమి చోద్యమో... ఈ పిల్లని నేను రెండేళ్ళగా(మీ కవితల్లోనే) చూస్తున్నాను ఎంత వెంటపడ్డా దొరకదు :-))

    ReplyDelete
    Replies
    1. వ్యర్ద ప్రయత్నాలు మానుకోవాలి, పిల్ల ( ఈ కాలం ) చాలా తెలివైనది,
      అయినా కొన్ని పరీక్షలను పెట్టి, సెలక్ట్ చేస్తుంది.
      అయినా ఇదేమి చోద్యమో .... ఈ పిల్లని నేను రెండేళ్ళగా ( మీ కవిత ల్లోనే ) చూస్తున్నాను ఎంత వెంటపడ్డా దొరకదు :-))

      ఔను! ఈ పిల్ల నా కావ్య నాయకి. ఒక ఐడియల్ కారెక్టర్! ఊహాత్మక భావన. అన్యాపదేసం గా మనసు భావాలను వ్యక్తం చెయ్యాలనుకున్నప్పుడు మాత్రమే నా హృదయం లో పూస్తుంది. అప్పుడు మనసు పరిమళిస్తుంది. ఆ పరిమళాలు ఎంత వ్యాపించాయో అనే ప్రశ్న కు సమాధానం గా మీ లాంటి వారి విశిష్ట పరిచయాలు, పరామర్శలు.
      ధన్యమనోభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభ సుప్రభాతం!!

      Delete