కాలం ముఖద్వారం లో
నిలబడి ఎదురుచూస్తున్నా!
ఆ దుర్భేద్య ద్వారాలు తెరుచుకుంటూనే,
చదునైన
పాలరాళ్ళ నేల పై,
నా మనోభావనలను కావ్యం గా రాయాలని ....
యాంత్రికంగా కదులుతున్న కాల చక్రం ఇరుసు లో
నలిగి మారిపోయి
ఒకనాడు రక్తవర్ణ ప్రేతవస్త్రం కప్పబడాల్సిన
ఒక మబ్బునని,
రంగరంగ వైభవం గా,
కిరీటము రాజచిహ్నాలు ధరించి ....
తళుకు, మిణుకుల, క్షణీకజ్యోతినై,
నిద్దుర లో ఉలికిపాటు ....
కొత్త కలనై,
ఆరడుగుల లోతు విడిది మాత్రమే శాశ్వతమని
అర్ధం ద్వనించే
పదాలతో
పాట ఒకటి రాయాలని ....
అనుకోవడమే తడువు......అద్భుతంగా జీవనసారాన్ని అర్ధమయ్యేలా అక్షరాల్లో ఇనుమడించి అందించారు
ReplyDeleteఅనుకోవడమే తడువు .... అద్భుతంగా జీవనసారాన్ని అర్ధమయ్యేలా అక్షరాల్లో ఇనుమడించి అందించారు.
Deleteఎంతో బాగుంది హుందాగా స్పందన
ధన్యమనోభివాదాలు పద్మార్పిత గారు! శుభమధ్యాహ్నం!!
మీ బ్లాగు ఇదే మొదటి సారండి చూడడం. గుండెచప్పుళ్లు ఆగిన మరుక్షణం... క్షణక్షణం మరుభూమి కోసం ఎదురు చూసే శిధిలశరీరం. వందేళ్లిస్తే యాభైకే తినేసే ఈ వ్యసనాల ప్రమాదాన్ని ఎంత చక్కగా చప్పారు. బాగుంది సర్.
ReplyDelete"మీ బ్లాగు ఇదే మొదటి సారండి చూడడం."
Deleteనా బ్లాగుకు మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను కొత్తూరి సతీష్ గారు!
"గుండెచప్పుళ్లు ఆగిన మరుక్షణం .... క్షణక్షణం మరుభూమి కోసం ఎదురు చూసే శిధిలశరీరం. వందేళ్లిస్తే యాభైకే తినేసే ఈ వ్యసనాల ప్రమాదాన్ని ఎంత చక్కగా చప్పారు. బాగుంది సర్."
చక్కని స్పందన ప్రోత్సాహక అభినందన
ధన్యాభివాదాలు సతీష్ గారు! శుభోదయం!!
ఆరడుగుల లోతు విడిది మాత్రమే శాశ్వతమని
ReplyDeleteఅర్ధం ద్వనించే.... ఈ పదాలు చదివిన తర్వాత ఇంకేమి మాట్లాడగలం నిక్కచ్చిగా,నిర్భయంగా ద్వనించే మీ పదాలు మిమ్ము(మీ కవితను) కలకాలం మా గుండెల్లొ నిలుపుతాయి సర్,
"ఆరడుగుల లోతు విడిది మాత్రమే శాశ్వతమని,
Deleteఅర్ధం ద్వనించే .... ఈ పదాలు చదివిన తర్వాత ఇంకేమి మాట్లాడగలం
నిక్కచ్చిగా, నిర్భయంగా ద్వనించే మీ పదాలు మిమ్ము(మీ కవితను) కలకాలం మా గుండెల్లొ నిలుపుతాయి సర్, "
ఎంత చక్కని ఆస్వాసన మీ స్పందన స్నేహ అభినందన
నమస్సులు మెరాజ్ గారు! శుభారుణోదయం!!
చదువుకున్న వారు కూడా ఈ దుర్వ్యసనాల బారిన పడి అకాల మృత్యువును ఆహ్వానించడానికి సిద్ధపడడం నిజంగా దురదృష్టం చంద్ర గారు.....బాగా వివరించారు.
ReplyDeleteచదువుకున్న వారు కూడా ఈ దుర్వ్యశనాల బారిన పడి అకాల మృత్యువును ఆహ్వానించడానికి సిద్ధపడడం నిజంగా దురదృష్టం చంద్ర గారు.....బాగా వివరించారు.
Deleteచక్కని స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!