నన్నందరూ కవయిత్రి అనే పిలుస్తారు.
నిజానికి
నేను కవయిత్రిని కాను. రాయలేను.
నీవు నా జీవితం లోకి ఎలా నడిచొచ్చావో
నా భుజాలమీద చెయ్యేసి,
నన్నెలా దగ్గరకు తీసుకున్నావో ....
అంతలోనే దూరమౌతూ .... వెళుతున్నానని,
సంకేతమైనా ఇవ్వకుండా ....
ఎలావెళ్ళిపోయావో అని.
నేను రాయలేను.
నీవు, నా హృదయాన్ని పగలగొట్టిన
ఆ రాత్రి గురించి,
ఆ రాత్రిని గురించి .... మాత్రమే కాదు.
నీవు, నీ దినకృత్యాల్లో భంగపడి,
అవమానపడిన ప్రతి రోజూ .... ఆ ప్రతిక్రియను
నా హృదయాన్ని బ్రద్దలు చేసి ఆనందించావని,
నిర్ద్వందంగా నేను రాయలేను.
ఒక మనిషి .... అంత దారుణంగా
అబద్దాలు ఆడతాడు అని కాని,
మరో మనిషిని మార్గమధ్యం లో
అంత నిర్దయగా అలా
అనాదగా ఒదిలెయ్యగలడు అని కానీ,
ఏడుపుకు కారణాలెన్నో నేను రాయలేను.
నా శక్తికి, ఊహకు అందని అనర్ధాలవి.
ఎందరో నన్ను అంటుంటారు రచయిత్రీ అని.
కానీ, నేను రచయిత్రిని కాను.
నాకు రాయడం రాదు.
నేను ఎంతవరకు రాయగలనని అనుకుంటానో
అంతకు మించి రాయలేను.
బలవంతంగా ఎప్పుడైనా రాయాలని కూర్చుంటే,
ఆ పంక్తుల మధ్యకు,
ఆ అక్షరాల మధ్యకు,
ఆ ఖాళీ స్థలాల మధ్యకు నీవు వస్తే
చూడాలని ఉందని రాయాలని ఉంటుంది.
అది ఒక కల అని,
అది నీవు నా నుదుట ముద్దాడి,
నిద్రలేపుతున్న పీడకల అని .... రాయాలనుంటుంది.
కానీ, అది నిజం కాదు. ఎంత నేను రాసినా.
అన్ని రంగులను సరైన పాళ్ళలో కలిపినప్పుడే
స్వచ్చమైన మరోరంగు వచ్చేది.
నేను రాయలేను. నిజం!
పిసినారితనం కన్నా
ఎందుకు కోపం, బాధే నయం అని,
చిరాకూ, బుర్ర బ్రద్దలు కోవడం కన్నా
ఆలోచించకుండా ఉండటం .... ఎందుకు మేలో అని.
నాకు, నీగురించి మాత్రమే రాయాలని ఉంటుంది.
నీ గురించే .... ఒక్క నీగురించి మాత్రమే.
కానీ రాసిందే రాయడం నాకు చిరాకు.
ఎన్నోసార్లు రాసుకున్నాను కనుక.
నీ గురించి మరి రాయలేను.
చదివేందుకు నీవు లేవని .... నేను రాసేందుకు
కొత్తగా మన మధ్య ఏమీ లేదు కనుక రాయలేను.
జీవితం నన్ను బాధిస్తుంది.
భూమాత ఇప్పటికీ ఏడుస్తూనే ఉంది.
ఎందరో పిల్లలు ఇంకా ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు.
ఈ నీరు,
ఈ గాలి,
ఈ అగ్ని,
ఆ ఆకాశం,
ఆ సూర్యుడు నిత్యం తల్లడిల్లుతూనే ఉన్నారు.
అమాయకపు బాల బాలికల హృదయ సంరక్షణ కోసం ....
కానీ,
మరి అంతా సవ్యంగానే జరుగుతుంది అనుకుంటూ,
ఆ కాలపురుషుడు మాత్రం కదులుతూనే ఉన్నాడు.
రాయలేని అశక్తత ముందు పదాలు ఓడిపోయి
ReplyDeleteప్రతి దృశ్యము నిజమంటి కలగా,
కలతగా ఒక్కో చిత్రాన్నీ ఆవిష్కరించాయి.
ప్రతి చిత్రమూ సజీవమే.
మరుపులొని జ్ఞ్యాపకాలు,
మరపురాని జ్ఞ్యాతకాలు
మనసులో చెదరని సంతకాలు..
"రాయలేని అశక్తత ముందు పదాలు ఓడిపోయి ప్రతి దృశ్యము నిజమంటి కలగా, కలతగా ఒక్కో చిత్రాన్నీ ఆవిష్కరించాయి.
Deleteప్రతి చిత్రమూ సజీవమే.
మరుపులొని జ్ఞ్యాపకాలు, మరపురాని జ్ఞ్యాతకాలు మనసులో చెదరని సంతకాలు.. "
బాగుందని స్నేహాభినందన చక్కని విశ్లేషణాత్మక స్పందన
ధన్యవాదాలు జాని పాషా గారు! శుభోదయం!!
సర్, నేనూ, రాయలేను కలచి వేసే ఎన్నో సంఘటనలను కడిగేద్ద్దాం అనుకుంటా,
ReplyDeleteకలహించిన ఎందరినో అడిగేద్దాం అనుకుంటా,
కానీ ఆ ద్రోహం భాషకు అందటం లేదు, భావం లో పొందుకావటమూ లేదు,
మరో ప్రక్క ఆకలీ, నైరాస్యమూ నా కలాన్ని ఎత్తుకెళ్ళి తమ బాదలు చెప్పుకొంటున్నాయి.
మీ కవితలో ఉన్న ఎన్నో పదాలు నన్ను ఎంకౌంటర్ చేశాయి. చాలా బాగుంది కవిత.
సర్, నేనూ, రాయలేను కలచి వేసే ఎన్నో సంఘటనలను కడిగేద్దాం అనుకుంటా, కలహించిన ఎందరినో అడిగేద్దాం అనుకుంటా,
Deleteకానీ, ఆ ద్రోహం భాషకు అందటం లేదు, భావం లో పొందుకావటమూ లేదు,
మరో ప్రక్క ఆకలీ, నైరాస్యమూ నా కలాన్ని ఎత్తుకెళ్ళి తమ బాదలు చెప్పుకొంటున్నాయి.
మీ కవితలో ఉన్న ఎన్నో పదాలు నన్ను నిలబెట్టి ప్రశ్నించాయి (ఎన్ కౌంటర్ చేశాయి).
చాలా బాగుంది కవిత.
చాలా చాలా బాగుంది స్పందన. మనసులోతుల్లో బాధను పదాలుగా మార్చేందుకు సమయము దొరకని ఆవేదనను చదువుతున్నట్లుంది. చక్కని స్నేహ ప్రోత్సాహక అభినందన
ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు!