ఒక్కసారి చూస్తే చాలనుకుంటున్నాను.
నీ కళ్ళలోకి,
నీ ఒక్క వీక్షణం చాలు.
గుండె ఊపిరి ఆగిపోవడానికి,
అంత అందంగా ఉంటావు నీవు.
ఒక్క ముద్దు చాలు.
పోయిన ప్రాణం తిరిగొచ్చేందుకు,
ఆ ముద్దు కోసం .....
ఎన్నిసార్లైనా మరణించేందుకు సిద్దం నేను.
అంత గొప్ప అందానివి నీవు.
ఒక్క స్పర్శ చాలు.
ఎక్కడి నుంచి వస్తుందో ఆ చేతనత్వం,
వెచ్చదనం,
ఆత్మను గుండెను కలిపి పిండినట్లౌతుంది.
అంత సౌదర్యం దివ్యత్వం నీవు.
కేవలం .... ఒక్క చిరునవ్వు చాలు.
నన్నొక మృగాన్ని పిచ్చివాడ్ని చేసేందుకు,
ఆ నవ్వు కోసం ....
సప్తసముద్రాల నైనా ఈదొస్తాను.
అంత అద్భుతం నీ అందం ఆ ప్రకాశం.
కేవలం .... ఒక్క చిరునవ్వు చాలు.
ReplyDeleteనన్నొక మృగాన్ని పిచ్చివాడ్ని చేసేందుకు,
ఆ నవ్వు కోసం ....నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నట్లుందండి.:-)
"కేవలం .... ఒక్క చిరునవ్వు చాలు.
Deleteనన్నొక మృగాన్ని పిచ్చివాడ్ని చేసేందుకు,"
ఆ నవ్వు కోసం .... నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నట్లుందండి.:-)
చక్కని చిరునవ్వు స్పందన గా చాలా బాగుంది స్నేహాభినందన స్పందన
అభివాదాలు పద్మార్పిత గారు!