Wednesday, January 8, 2014

ఒక నీడను ఇన్నాళ్ళూ నేను



 















ఒక భూతం లా .... నేను,
తచ్చాడుతూ ఉన్నాను. పరిసరాలలో .... ఇన్నాళ్ళూ
కోరికలను అంతరంగం లో తొక్కేసి
అసంపూర్ణుడ్నిలా
అగమ్యం గా, అయాచితం గా ....

నీ పక్కన,
నీతో కలిసి అడుగులు వెసిన క్షణం వరకూ
తెలుసుకోలేక .... అంతరంగం లోని కోరికలను
ఘాడమైన భావనలను ....
ఆశలను .... అణగద్రొక్కుకుని తిరుగుతూ,




 











నీ చెయ్యందుకుని సహచరించాలనే
ఒక చిన్న ఆశ ....
నన్ను నలిపి,
నిలిపేసాకే తెలిసుకున్నా!
జీవితంలో యాంత్రికత ఇంత దయనీయమా అని.

4 comments:

  1. " నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
    నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని
    పంచేందుకే ఒకరు లేని బ్రతుకెంత బరువో అనీ "
    పాటను , ఆ పాటలోని భావాన్ని ...
    మీ కవితలో బాగా చూపించారు చంద్రగారు .

    ReplyDelete
    Replies
    1. "నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్ననీ
      నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని
      పంచేందుకే ఒకరు లేని బ్రతుకెంత బరువో అనీ"
      పాటను , ఆ పాటలోని భావాన్ని ....
      మీ కవితలో బాగా చూపించారు చంద్రగారు.
      ఒక మంచి పాటను గుర్తు చేసారు. చక్కని స్పందన స్నేహాభినందనతో
      నమస్సులు శ్రీదేవీ!

      Delete
  2. భూత...యంత్రాల్లాంటి మనుషులకు కూడా
    భావోద్వేగాలను అమర్చగలిగే మెకానిక్ మీరు...

    ReplyDelete
    Replies
    1. భూత .... యాంత్రిక జీవితాలకు కూడా
      భావోద్వేగాలను అమర్చగలిగే మెకానిక్ మీరు ....
      చక్కని కాంప్లిమెంట్ .... ఎన్ ఎం రావు గారు "మీరు" కాదు. మనం
      మనిషి దృష్టికోణం లోని గొప్పతనం అది ....
      ధన్యవాదాలు మిత్రమా!

      Delete