జీవితం అస్తవ్యస్తమయ్యి
రాత్రుళ్ళు ....
నిద్దుర దూరం అయి,
అన్ని నమ్మకాల్నీ ....
కోల్పోవాల్సొచ్చి,
ఆశలు అణగారి,
గుండె విశ్చిన్నం అయి,
కాలం కలిసిరాని క్షణాల్లో
ప్రపంచం ఒక బందీఖానా లా ....
బయటపడే మార్గం అగమ్యమై,
ఆక్రోశిస్తున్నప్పుడు ....
పోరాడేందుకు అశక్తుడివైనప్పుడు ....
నేనున్నాను.
నీ సరసన నడిచేందుకు.
తోడునై నీడగా
ప్రకృతి ప్రకోపం నీపై పడకుండా ....
కన్నీళ్ళను తుడిచేందుకు,
భయాల్ని దూరంగా ఉంచి,
ఉల్లాసం, ఆనందం ....
వెలుగులు పరిచేందుకు,
నిన్ను నీవు కోల్పోయి ....
అయోమయాందకారం లో
విలవిల్లాడుతున్నప్పుడు ....
నేనున్నానని గుర్తు చేస్తూ,
ఎప్పుడైనా,
"ఇక ముందుకు పోలేను.
జీవించడం కష్టం!
నిత్యం భరిస్తూ సాగిస్తున్న జీవితమే
కలలు" అని అనిపించి
అంతలోనే కాదనిపించిన క్షణాల్లో .....
ప్రపంచమంతా ఒక్కటై,
సాదిస్తున్న భావన
నిన్ను వేదిస్తున్న క్షణాల్లో ....
తుఫాను తీవ్రత పెరిగి
సునామీగా మారి
వెలుగనేది నీకు కనిపించనప్పుడు ....
నీ చూపునై,
నువ్వెక్కడ ఉన్నావు?
ఏ పరిస్థితుల్లో ఉన్నావు?
అన్నది, ముఖ్యం కాదు
నీ నీడలా, తోడుగా
నీ వెంటే ఉంటాను.
ఒక కొండలా, కోటగోడలా
రక్షణ కల్పిస్తూ
ఒక మార్గదర్శకుడిలా ....
అందుకే
నా చెంతకు రా!
ఒక తోడుగా, నీడనై ఉంటాను.
గువ్వ పిట్టను గుండెల్లో పొదవుకునే తరువు తనం.
ReplyDeleteచిన్ని గుండెకు స్పందనిచ్చిన అమ్మతనం. మీ కవితలో ఉంది సర్.
"గువ్వ పిట్టను గుండెల్లో పొదవుకునే తరువు తనం, చిన్ని గుండెకు స్పందనిచ్చిన అమ్మతనం, మీ కవితలో ఉంది సర్."
Deleteచాలా చక్కని ప్రశంస స్పందన స్నేహ ఆత్మీయాభినందన
:) ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభమధ్యాహ్నం!!
నువ్వెక్కడ ఉన్నావు?
ReplyDeleteఏ పరిస్థితుల్లో ఉన్నావు?
అన్నది, ముఖ్యం కాదు
నా చెంతకు రా!
ఒక తోడుగా, నీడనై ఉంటాను.
ఇంత అభయమిచ్చే హస్తం
అమ్మది కాక ఇంకెవరిదవుతుంది
చెప్పండి ...చంద్రగారు కవిత
అమ్మ అంత బాగుంది .
"నువ్వెక్కడ ఉన్నావు? ఏ పరిస్థితుల్లో ఉన్నావు?
Deleteఅన్నది, ముఖ్యం కాదు.
నా చెంతకు రా! ఒక తోడుగా, నీడనై ఉంటాను."
ఇంత అభయమిచ్చే హస్తం ఒక్క అమ్మది కాక ఇంకెవరిది అవుతుంది.
చెప్పండి ...చంద్రగారు. కవిత అమ్మ అంత బాగుంది .
చాలా చిక్కని స్పందన స్నేహాభినందన
ధన్యమనోభివాదాలు శ్రీదేవి! శుభమధ్యాహ్నం!!
ప్రతి పదంలోను అందమైన భావాన్ని పొందు పరిచారు.
ReplyDelete"ప్రతి పదంలోను అందమైన భావాన్ని పొందు పరిచారు."
Deleteనా బ్లాగు కు స్వాగతం ప్రేరణ గారు. బాగుంది మనసు స్పందన ప్రోత్సాహక అభినందన
ధన్యవాదాలు! శుభోదయం!!
నేనున్నాను.
ReplyDeleteనీ సరసన నడిచేందుకు.
తోడునై నీడగా
ప్రకృతి ప్రకోపం నీపై పడకుండా ....
కన్నీళ్ళను తుడిచేందుకు
తోడుంటే ఎంతబాగుంటుందో కదా అన్న ఫీల్ ని కలిగించారు అసాంతం మీ కవితను చదివించి. చాలా బాగుందండి.
"నేనున్నాను. నీ సరసన నడిచేందుకు.
Deleteతోడునై నీడగా
ప్రకృతి ప్రకోపం నీపై పడకుండా .... కన్నీళ్ళను తుడిచేందుకు"
తోడుంటే ఎంతబాగుంటుందో కదా అన్న ఫీల్ ని కలిగించారు అసాంతం మీ కవితను చదివించి.
చాలా బాగుందండి.
చాలా బాగుంది స్పందన స్నేహ ప్రోత్సాహక అభినందన
నమస్స్లు పద్మార్పిత గారు! శుభారుణోదయం!!