నీవు పడిపోతావనిపించినప్పుడు
నా కాళ్ళు తడబడుతుంటాయి.
నీవు జీవితంలో భంగపడ్డప్పుడు
నేను నీరసపడి కృంగిపోతుంటాను.
బోర్లా పడిన గాయం నిన్ను బాధిస్తే
నాకు ప్రాణం పోతున్నట్లుంటుంది.
బలహీనతలు నిన్ను దిగజారిస్తే
పెంపకం లోపం అనుకుని అవివేకినౌతుంటాను.
నీవు నన్ను చేరలేని స్థితే ఎదురైతే
ఎలా బ్రతుకుతావో అని తల్లడిల్లుతుంటాను.
evarandi ee kavitha cheppindi chala exellent
ReplyDeleteఎవరండి ఈ కవిత చెప్పింది చాలా ఎక్సలెంట్
Deleteముందుగా మిమ్మల్ని స్వాగతిస్తున్నాను నా బ్లాగు కు రాజవర్ధన్ రెడ్డి గారు!
మీ స్పందన ఏకీభావన ప్రోత్సాహక అభినందన
ధన్యాభీవాదాలు రాజవర్ధన్ రెడ్డి గారు! శుభోదయం!!
అమ్మ ఉండగా ఎలాంటి బాదా నొప్పించదు.
ReplyDeleteబాగుంది సర్, అమ్మ వంటి కమ్మదనంగా.
అమ్మ తోడు ఉండగా ఎలాంటి బాధా దరికి రాదు నొప్పించదు.
Deleteబాగుంది సర్, అమ్మ వంటి కమ్మదనంగా.
ప్రతి స్త్రీలోనూ ఒక అమ్మను చూడగలము.
ఏ అమ్మ ప్రేమైనా బిడ్డకు ఒక రక్షణ కవచమే .... ఒక చక్కని స్పందన స్నేహాభినందన
ధన్యాభివాదాలు మెరాజ్ గారు!
అమ్మ ఆలోచనా తరంగాలలో బిడ్డలకు తప్ప ఎవరికీ చోటు ఉండదు , అమ్మ ఆశ ,శ్వాస ,ధ్యాస అన్నీ పిల్లలకే అంకితమిస్తుంది , తనకంటూ ఏమీ మిగుల్చుకోదు , పిల్లల జ్ఞాపకాలు తప్ప .చంద్రగారు అమ్మ గూర్చి ఎంత చెప్పినా తక్కువే , అసంపూర్ణమే అనిపిస్తుంది .కవిత చాలా బాగుంది .
ReplyDeleteఅమ్మ ఆలోచనా తరంగాలలో బిడ్డలకు తప్ప ఎవరికీ చోటు ఉండదు, అమ్మ ఆశ ,శ్వాస ,ధ్యాస అన్నీ పిల్లలకే అంకితమిస్తుంది, తనకంటూ ఏమీ మిగుల్చుకోదు, పిల్లల జ్ఞాపకాలు తప్ప.
Deleteచంద్రగారు అమ్మ గూర్చి ఎంత చెప్పినా తక్కువే, అసంపూర్ణమే అనిపిస్తుంది.
కవిత చాలా బాగుంది.
చక్కని విశ్లేషణాత్మక స్పందన స్నేహ ఆత్మీయాభినందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభోదయం!!