Wednesday, January 29, 2014

అలక్ష్యం చేస్తూ ....




 










దూరంగా ఉండి నన్నే చూస్తున్నావు!
ఇక్కడ ఈ గదిలో, ఈ చీకటిలో
ఒంటరి మౌనాన్ని, నన్ను,
కిటికీలోంచి బయటికి శూన్యం లోకి చూస్తూ ఉన్న
బండబారి గమ్యం కోల్పొయిన గుండె ను,
దారం తెగి రాలి పడిపోతున్న గాలిపటాన్ని

నీడలా అలా నీవు
నన్ను ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది.
చేతులు చాచి రా, రమ్మంటున్నట్లు 
నీ పిలుపును
నేను గమనిస్తున్నానో లేదో అన్న భావనతో

ఎవరూ ఇష్టపడని ఒంటరితనం
ఏడుపు .... తగదు అని చెబుతూ,
చేరదీసి, గుండెల్లో దాచుకునే ఔదార్యానివి లా ....
తీవ్రంగా గాయపడి ఉన్నానని, 
అమూల్యమైన సమయం వృధా అయ్యిందని,
ఎవరికీ ఇష్టం లేని ఒంటరితనాన్ని .... తరిమికొట్టే
నన్నెందుకు ప్రేమించనియ్యవు అని ప్రశ్నిస్తున్నట్లుంటుంది.

నీ గొంతు స్పష్టంగా
నీవు పాడుతున్న ఆ పాట ....
ఆ బుజ్జగింపు రాగం .... మనోజ్ఞంగా వినిపిస్తుంది. 
సుతిమెత్తటి అనునయం నన్ను లొంగదీసుకుంటుంది..
ఉన్నదాన్ని ఉన్నట్లుగా లేచి, పరుగు పరుగున వచ్చి ....
నిన్ను చేరి చుట్టెయ్యాలన్నంత బలంగా,

అసహనం, నిరాశక్తత ప్రబలక మునుపే
నీ వద్దకు చేరాలని
బిర బిరా పరుగులుతీస్తూ .... నీ కౌగిట్లోకి
ఈ శ్వాస ఆగక మునుపే
నా నిర్ణయం .... ఒక లక్ష్యసాదన గా మారాలనేంతగా,

నీవు నా అవసరం, శ్వాసవై 
నీ జీవితం అవసరం నేనే అన్నట్లు నీవు నన్ను.
"దూరంగా వెళ్ళొద్దు,
నన్నొదిలి ,ఎటూ .... వెళ్ళొద్దు! దురంగా," అని
అనుకునే విధంగా, గొంతెత్తి పిలిచేలా



ఎవరికీ ఒంటరిగా ఉండాలని ఉండదు ....
అయినా .... నాకే ఎందుకో? ఎందుకు?
ఒంటరి ఆవేదనలో ఈ ఆనందం!
దురంగా నీడలా నీవు, చేతులు చూచి రారమ్మని పిలుస్తున్నా
నీ ప్రేమాహ్వానం పిలుపుల్ని అలక్ష్యం చేస్తూ,

4 comments:

  1. ఒక్కొక్కసారి ఒంటరితనంలోనూ ఆనందం అనిపిస్తుందనేది వాస్తవం,అంతమాత్రాన ఎదుటివారిని అలక్ష్యం చేస్తున్నట్లు కాదు. చంద్రగారు బాగా చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. ఒక్కొక్కసారి ఒంటరితనంలోనూ ఆనందం ఉంది అనిపిస్తుందనేది వాస్తవం, అంతమాత్రాన ఎదుటివారిని అలక్ష్యం చేస్తున్నట్లు కాదు చంద్రగారు బాగా చెప్పారు.
      ఒక మంచి సూచనాత్మక స్పందన స్నేహాభినందన
      ధన్యవాదాలు శ్రీదేవీ!

      Delete
  2. నీవు నా అవసరం, శ్వాసవై
    నీ జీవితం అవసరం నేనే అన్నట్లు నీవు నన్ను.
    "దూరంగా వెళ్ళొద్దు, ... ఇలాంటి రచనలు మరీ వంటరి తనాన్ని గుర్తుకు తెస్తాయి.
    సర్, ఎందుకో కొంచం దిగులును పలికిస్తుంది మీ కలం.

    ReplyDelete
    Replies
    1. నీవు నా అవసరం, శ్వాసవై
      నీ జీవితం అవసరం నేనే అన్నట్లు నీవు నన్ను.
      "దూరంగా వెళ్ళొద్దు, ..."
      ఇలాంటి రచనలు మరీ వంటరి తనాన్ని గుర్తుకు తెస్తాయి. సర్, ఎందుకో కొంచం దిగులును పలికిస్తుంది మీ కలం.

      ప్రకృతి పరిసరాలు సంఘటనలు మనిషిని ప్రభావితం చేస్తే ఆలోచనలు అతని నడవడికను అతని ఆవేశాన్ని రకరకాల రాగాలు రంగుల లో ప్రతిబింబిస్తుందని సూచనాత్మక స్పందన స్నేహ ఆత్మీయాభినందన
      ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!

      Delete