Monday, January 20, 2014

నాలుగు కళ్ళు ఒకే చూపు



 









నేనెప్పుడూ ఒంటరిని అని అనుకోలేదు.
ఆనందంగా
అల్లరే తోడుగా తిరిగినంత కాలం 
ఒక అమృత హస్తం సాహచర్యం అవసరాన్ని
ఊహించను కూడా లేదు
నాకు కావల్సిన, పొందాల్సిన గుర్తుండాల్సిన
జ్ఞాపకం .... జీవనానుభవమొకటి ఉందని
అందుకోసం ....
అదృష్టం నీవై .... ఎదురొస్తావని అనుకోలేదు.
నీవుగా వచ్చి నా కళ్ళు తెరిచేవరకూ,

ఇప్పుడు నా ఆలొచనల నిండా నీవే
నా జీవితం లో,
నా కలలో,
నా గుండెలో ....
ఇద్దరమూ వేరు కాదని అర్ధం అయ్యింది.
మనం ఒకరికోసం వొకరిమని
నా బాహువుల్లో, నా ప్రపంచానివై నీవు
ఇమిడుండే వరకూ
నేను సంపూర్ణుడ్నని ఎరుగను.
ఇప్పుడు నిన్ను నా నుంచి
విడదీసి చూసే ఊహను కూడా భరించలేను. 



 










ఏనాడూ అనుకోలేదు.
ప్రేమ, ఇంత వింత మానసిక భావన అని,
అందులో ఇంత ఉత్సుకత ఉంటుందని,
ఊహకందని ఆకర్షణ నిన్నూ నన్నూ ఉక్కిరిబిక్కిరి చేసి
ఇరు హృదయాలను ఒక్కటి చేస్తుందని,
ఒకే ఆలోచన, ఒకే దృష్టి కోణం .... కలయిక
సుముహూర్తం
మన కోసం ఎదురుచూస్తుందని ....
అనుకోలేదు. కలనైనా తట్టలేదు.
నీ ఎదచాలనం తో నీవు నా కళ్ళు తెరిచి కలిసేవరకూ.

4 comments:

  1. గుండె కొట్టుకోవడం వేరు ,హృదయ స్పందన వేరు ...స్పందనలు శాశ్వతత్వానికి చిరునామాలు..చంద్రగారు .కవిత బాగుంది ఓ మంచి స్పందనలా .

    ReplyDelete
    Replies
    1. గుండె, కొట్టుకోవడం వేరు స్పందించడం వేరు .... స్పందనలు శాశ్వతత్వం చిరునామాలు ....
      చంద్రగారు కవిత బాగుంది ఓ మంచి స్పందనలా

      చక్కని ప్రశంస స్నేహ ఆత్మీయాభినందన ఈ స్పందన
      నమస్సులు శ్రీదేవీ!

      Delete
  2. అందుకోసం ....
    అదృష్టం నీవై .... ఎదురొస్తావని అనుకోలేదు...
    ఏనాడూ అనుకోలేదు.
    ప్రేమ, ఇంత వింత మానసిక భావన అని...
    అందులో ఇంత ఉత్సుకత ఉంటుందని...
    కలయిక సుముహూర్తం
    మన కోసం ఎదురుచూస్తుందని ...
    నీ ఎదచాలనం తో నీవు నా కళ్ళు తెరిచి కలిసేవరకూ...

    ప్రేమిక జ్ఞాపకాల... పరవశపు
    ప్రేమైక హృదయ స్పందన...
    మది నింపిన ప్రణయ రాగ వర్ణన...

    మామూలుగా కొట్టుకునే గుండెలకు కూడా
    హృదయ స్పందనలు నేర్పిన ప్రేమ కవులు మీరు...
    అచ్చమైన ప్రేమ భావనలకు కేరాఫ్ చిరునామా మీరు...

    హృదయపూర్వక అభినందనలు...



    ReplyDelete
    Replies
    1. "అందుకోసం ....
      అదృష్టం నీవై .... ఎదురొస్తావని అనుకోలేదు ....
      ఏనాడూ అనుకోలేదు.
      ప్రేమ, ఇంత వింత మానసిక భావన అని .... అందులో ఇంత ఉత్సుకత ఉంటుందని ....
      కలయిక సుముహూర్తం, మన కోసం ఎదురుచూస్తుందని .... నీ ఎదచాలనం తో, నీవు నా కళ్ళు తెరిచి కలిసేవరకూ ...."

      "ప్రేమిక జ్ఞాపకాల .... పరవశపు ప్రేమైక హృదయ స్పందన .... మది నింపిన ప్రణయ రాగ వర్ణన ....
      మామూలుగా కొట్టుకునే గుండెలకు కూడా హృదయ స్పందనలు నేర్పిన ప్రేమ కవులు మీరు .... అచ్చమైన ప్రేమ భావనలకు కేరాఫ్ చిరునామా మీరు .... హృదయపూర్వక అభినందనలు!"

      ప్రేమతత్వం ఔపాసన పట్టినవారికి మాత్రమే తెలుస్తుంది ప్రేమ పారవశ్య పరిబాష .... ఎంతో చక్కని కాంప్లిమెంట్, స్పందన స్నేహాభినందన
      ధన్యమనోభివాదాలు ఎన్ ఎం రావు బండి గారు! సుప్రభాతం!!

      Delete