మార్పు కోసం కావొచ్చు, మెచ్చుకోలు కోసం కావొచ్చు
వచన కవిత్వాన్ని మళ్ళీ మళ్ళీ మైక్ లో ఊదుతూ
ఓ నేస్తమా! నీలో నీవు .... అంతగా
ఆ గర్వం ఫీల్ అవసరమా!
చతుష్పాదాల కట్టుబాట్ల
చందోబద్ద సాహిత్యాన్నొదిలేసి,
సుదీర్ఘ రాగాల .... పద్యాలనొదిలి,
చురకత్తులు, వాడి పదాల విప్లవ సాహిత్యాన్నొదిలి.
ఈ సంచలనాత్మక, మనసు భావనల
సామాజిక పదచిత్రాన్ని భావనాత్మకం గా చదువుతున్నట్లు,
వేదిక పై నీవు పడుతున్న ....
అవస్థ, నీ కదలికలు నవ్వును తెప్పిస్తున్నాయి.
మార్పు కోసం, మాలిన్య నిర్మూలనం కోసం
పొంగుతున్న, అణచిపెట్టుకున్న .... ఆవేశం బేస్ తగ్గించి,
కేవలం నీ పేరు నీ ముఖం
మాత్రం కొన్ని రోజుల వరకు గుర్తుండిపోతే చాలన్నట్లు.
వాళ్ల బ్రమ అలాంటివాళ్ళు అస్సలు గుర్తుండరు, చుట్టూ ఉన్న బజంత్రీగాళ్ళు తగ్గగానే వీళ్ళు బోర్లించిన డబ్బాలవుతారు.
ReplyDeleteపదికాలాలపాటు నిలిచేది సామాజిక మార్పుకై ఆశించే కవిత్వం.
మనస్సును హత్తుకొనే వాఖ్యం.
మీ భావాలు సందించిన బాణాల్లా ఉన్నాయి
వాళ్ల బ్రమ! అలాంటివాళ్ళు అస్సలు గుర్తుండరు, చుట్టూ ఉన్న బజంత్రీగాళ్ళు తగ్గగానే వీళ్ళు బోర్లించిన డబ్బాలవుతారు.
Deleteపదికాలాలపాటు నిలిచేది సామాజిక మార్పుకై ఆశించే కవిత్వం మాత్రమే.
మనస్సును హత్తుకొనే వాఖ్యమే.
మీ భావాలు సందించిన బాణాల్లా ఉన్నాయి.
చక్కని సూచనాత్మక ప్రశంస .... బాగుంది స్పందన స్నేహాభినందన
ధన్యవాదాలు మెరాజ్ ఫాతిమా గారు!
మంచి కవిత్వం మనం గుర్తుంచుకో అవసరం లేదు ,అదే గుర్తుంటుంది , దానికోసం ఎవరూ వ్యయ ప్రయాసలతో మన ముందు విన్యాసాలు చేయనవసరంలేదు . చంద్ర గారు అనవసర ఆర్భాటాలకు అడ్డుకట్ట వేసేవిధంగా చెప్పారు .చాలా బాగుంది . అతి సర్వత్ర వర్జయేత్ .
ReplyDeleteమంచి కవిత్వం ప్రయోజనాత్మక కవిత్వం .... మనం గుర్తుంచుకో అవసరం లేదు, అదే గుర్తుంటుంది, దానికోసం ఎవరూ వ్యయ ప్రయాసలతో మన ముందు విన్యాసాలు చేయనవసరంలేదు. చంద్ర గారు అనవసర ఆర్భాటాలకు అడ్డుకట్ట వేసేవిధంగా చెప్పారు. చాలా బాగుంది. అతి సర్వత్ర వర్జయేత్.
Deleteచిక్కని విశ్లేఅషణాత్మక ప్రశంస .... చక్కని స్పందన ఆత్మీయాభినందన
ధన్యాభివాదాలు శ్రీదేవీ!
This comment has been removed by the author.
ReplyDeletenice post...
ReplyDeleteనైస్ పోస్ట్
Deleteబాగుంది స్పందన అభినందన
ధన్యాభివాదాలు ఎన్ ఎం రావు బండి గారు!