గాలీ, వెలుతురు నిలయం లా
ఆ మండువా లోగిలి
పెరటి కాళీ స్థలం లో
జామ చెట్టూ, పూల మొక్కలు,
ముచ్చట్లు,
మురిపాలు ఆడుకునేందుకు
శుభ్రంగా ఊడ్చిన
ఆ పొడుగాటి ఆ సిమెంట్ అరుగు.
ఆ అరుగుకు కాస్త దూరంగా అతను ....
ఒంటరి గా
కన్నీటిలో తడుస్తూ ....
ఆ పొరుగునే ఉన్న
ఆ ఇంటి కిటికీ వైపు చూస్తూ ....
అతని గుండె సలుపుతూ
ఎన్ని తరాల క్రితమో
కట్టబడిన ....
అనురాగ వారసత్వం
పొదరిల్లు అది.
ఆ మండువా లోగిలి లో
శోకదేవత లా ఆమె.
ఆ పెరటి పుష్ప లతల పరిమళాలు
ఆ ఆశలు వడలిన రేకులు ....
నేలరాలిపోతూ,
స్నేహ బందుమిత్ర పరివారం
చుట్టేసిన సందడి
ఆ సందడి లో
ప్రేమ బంధాన్నొదలాల్సొచ్చిన
పసుపుతాడు బంధం
అయిష్టత .... ఆమె ముఖంలో
ఆమె చూపులు అతను చూస్తున్న
అదే కిటికీ వైపు
లోపలినుంచి చూస్తూ
అవాంచనీయ స్థితి కలవరం .....
అతని మనసు రోదిస్తుంది.
"నన్ను మన్నించు ప్రియా!
పరిస్థితులు ఇలా
పరిణమిస్తాయనుకోలేదు.
నాది తొందరపాటు నిర్ణయమే
కాదనను.
నీకు శ్రేయస్సనిపించి
ఇష్టాన్ని అయిష్టం అని చెప్పడం.
జీర్ణం కాని నిజం!
నేను అంత కఠినంగా
చెప్పగలనని నేనే అనుకోలేదు.
మన్నించవా మనసా!"
అని అనుకుంటూ అతను.
బాధ భారాన్ని
మొయ్యలేని స్థితి లో
ఆమెను విచలితను చేసి ....
ఆ జామ చెట్టూ,
ఆ పూలమొక్కలు పరిమళాలు
ముచ్చటించుకునేందుకు కట్టిన
ఆ సిమ్మెంటు అరుగులు
అక్కడ ఒంటరిగా అతను.
అతని ప్రపంచం
సిమెంట్ లేని ఇసుక మేడలా
కూలిపోతున్నట్లు
పొరుగు ఇంటి కిటీకీ వైపే
చూస్తున్నాడు .... విచలితుడై ....
అతనికి ఆమె అంటే ఇష్టం!
అమితమైన ప్రేమ
జీవిస్తుంది ఆమె కోసమే
అన్నంతగా ....
పక్కన పీటల మీద
కూర్చోవాల్సిన మనిషి
ఒక పెళ్ళి పెద్ద గా
ప్రాణం ను పరాయిని చేసుకుని
అతను ఇప్పుడు
ఆ కన్నీటి వర్షం లో తడుస్తూ ....
ఇలాంటి స్థితి రానీయకూడదు, వస్తే అక్కడ ఉండకూడదు.
ReplyDeleteఇలాంటి స్థితి రానీయకూడదు, వస్తే అక్కడ ఉండకూడదు.
Deleteబాగుంది స్నేహాభినందన
ధన్యవాదాలు ఫాతిమా గారు! శుభోదయం!!
అది ఎంతో దయనీయమైన పరిస్థితి చంద్రగారు ...కవిత భారంగా ఉంది .
ReplyDeleteఅది ఎంతో దయనీయమైన పరిస్థితి చంద్రగారు ....
Deleteకవిత భారంగా ఉంది.
పాత్రతో సంఘీభావన స్పందన స్నేహాభినందన
ధన్యవాదాలు శ్రీదేవీ! శుభారుణోదయం!!
ఓ గాయపడిన హృదయాన్ని
ReplyDeleteఇంతకన్నా ఇంకెవరు కన్నులకు
కట్టగలరు...
ఓ వెచ్చనైన వేదనను
ఇంతకన్నా ఇంకెవరు గుండెలకు
గుచ్చగలరు...
మీకన్నా...
ఇంకెవరు...
ఓ నూతన మిత్రుని
శుభాభినందనలు...
ఓ గాయపడిన హృదయాన్ని
Deleteఇంతకన్నా ఇంకెవరు కన్నులకు కట్టగలరు...
ఓ వెచ్చనైన వేదనను
ఇంతకన్నా ఇంకెవరు గుండెలకు గుచ్చగలరు...
మీకన్నా...
ఇంకెవరు...
ఓ నూతన మిత్రుని శుభాభినందనలు...
మిత్రమా స్వాగతం నా బ్లాగుకు.
ఒక చక్కని స్పందన స్నేహాభినందన ను చదువుతున్నట్లుంది
ధన్యవాదాలు ఎన్ ఎం రావు బండి గారు!
మొదటిసారిగా మీ కవితను చదివాను...
Deleteఆవెంటనే మీ అభిమానిగా మారిపోయాను..
అనుకోకుండా ఏమీ తెలియకుండా బ్లాగుల ప్రపంచం లోకి అడుగుపెట్టాను...
మీలాంటి పెద్దల స్నేహపూర్వక ఔదార్యంతో... సాహచర్యంతో...పరుగుపెడతాను...
( నిజమే చెబుతున్న నోటివెంటా...
ఇకపై కూడా మీ బ్లాగుకు వెన్నంటి ఉంటా...)
ఆదరణకు శిరసా నమామి...
"మొదటిసారిగా మీ కవితను చదివాను...
Deleteఆవెంటనే మీ అభిమానిగా మారిపోయాను..
అనుకోకుండా ఏమీ తెలియకుండా బ్లాగుల ప్రపంచం లోకి అడుగుపెట్టాను...
మీలాంటి పెద్దల స్నేహపూర్వక ఔదార్యంతో .... సాహచర్యంతో.... పరుగుపెడతాను...
( నిజమే చెబుతున్న నోటివెంటా .... ఇకపై కూడా మీ బ్లాగుకు వెన్నంటి ఉంటా...)
ఆదరణకు శిరసా నమామి..." ....
మీ ఆస్వాసన లో ఉదార భావన ఉత్సాహం .... ఒక గొప్ప ప్రేరణాత్మక స్పందన యిది .... చాలా బాగుంది.
ధన్యమనోభివాదాలు ఎన్ ఎం రావు బండి గారు! శుభారుణోదయం!!
ప్చ్.....ఒక గాయపడిన మనసు రోధించి అలసిన ఫీల్ కి దృశ్యకావ్యం మీ ఈ కవిత
ReplyDelete"ప్చ్! .... ఒక గాయపడిన మనసు రోధించి అలసిన ఫీల్ కి దృశ్యకావ్యం మీ ఈ కవిత" ....
Deleteనిట్టుర్పు, చక్కని విశ్లేషణ .... స్నేహాభినందన ఈ స్పందన
ధన్యాభివాదాలు పద్మార్పిత గారు!