ప్రతి ప్రాణికి, జీవితం లో ఒక సమయం వస్తుంది
అప్పుడు, ఏదీ ముఖ్యం కాదు అనిపించడం తో పాటు
దృష్టి లోపము, అస్పష్టతే అంతా
అయోమయం చీకట్లు చుట్టూ ముసిరి,
ప్రేమ, కరుణ పారిపోయి,
ద్వేషం, భయం, స్వార్ధం శాసనం చేస్తాయి.
అసహాయ .... నిర్లిప్త, అపనమ్మకం,
అయుక్తం, ఊపిరాడనితనము ....
పిచ్చితనము బారం తో .....
మది, ఎదల మధ్య సంయమనం లోపించే,
అవాంచనీయ పరిస్థితి ఒకటి వస్తుంది.
ఆనందము, భయంతో దాక్కుని
బాధ, దుఃఖం, ఉన్మాదాలు పేట్రేగి ....
ముచ్చెమటలు పోసిన ఆ క్షణం లో
మనిషి, జీవమున్న శవమే! చావును స్వాగతిస్తూ,
ఆనందము, భయంతో దాక్కుని
ReplyDeleteబాధ, దుఃఖం, ఉన్మాదాలు పేట్రేగి ....
ముచ్చెమటలు పోసిన ఆ క్షణం లో
మనిషి, జీవమున్న శవమే!ఆ సమయంలోనే ఆ మనిషికి ఓ ఆప్యాయ స్పర్శ అవసరం లేకుంటే వారు ఉన్మాదాన్నో,చావునో ఆశ్రయిస్తారు...చంద్రగారు వాస్తవాన్ని చక్కగా వివరించారు.
"ఆనందము, భయంతో దాక్కుని
Deleteబాధ, దుఃఖం, ఉన్మాదాలు పేట్రేగి .... ముచ్చెమటలు పోసిన ఆ క్షణం లో
మనిషి, జీవమున్న శవమే!"
ఆ సమయంలోనే ఆ మనిషికి ఓ ఆప్యాయ స్పర్శ అవసరం లేకుంటే వారు ఉన్మాదాన్నో, చావునో ఆశ్రయిస్తారు....
చంద్రగారు వాస్తవాన్ని చక్కగా వివరించారు.
చక్కని విశ్లేషణాత్మకత స్పందన ....
ధన్యాభివాదాలు శ్రీదేవీ!