పొరుగున, ఊరు బయట
బంగరు మాగాణి పొలం లో
పంట రోజుల లో
గాలి పాయల బుజ్జగింపు, మురిపాలు
అమ్మవొడిలో లా
ఎదిగిన పంటమొక్కల తలలు
కంకుల్ని నిమురుతూ గాలి
అలలులా వరి పొలం
ఎత్తుపల్లాల నమూనా నేత లా
పంట ఊగుతూ,
ఆ సన్నివేశం, దృశ్యం
కాసింత దూరంగా నిలబడి
తదేకంగా
ఆ అందాల్నే ఆస్వాదిస్తూ
నీవూ నేనూ
ఆకులు రాలే కాలపు
ఆ లేత సున్నిత మందమారుతాల
పరామర్శల స్పర్శలు తాకి
మన హృదయాలు పరవసించి
అది ప్రకృతి రాగం .... మమతానురాగాలాపన
మీ ప్రకృతి రాగంలో మమతానులురాగాలు మైమరచిపోతున్నాయి....చంద్రగారు ప్రకృతి అంత రమణీయంగా ఉంది మీ వర్ణన.
ReplyDeleteమీ ప్రకృతి రాగంలో మమతానులురాగాలు మైమరచిపోతున్నాయి....
Deleteచంద్రగారు ప్రకృతి అంత రమణీయంగా ఉంది మీ వర్ణన.
బాగుంది స్పందన స్నేహాభినందన
ధన్యవాదాలు శ్రీదేవీ!