Saturday, February 15, 2014

కాదనుకున్నాక కూడా



 


















ఇరు హృదయాలలో ఒక హృదయం లో స్థానం కోల్పోయాక కూడా
ఆ హృదయాల మధ్య దూరం కొలవడం సాధ్యం కాదు.
కారణం, ఆ వ్యక్తుల ఆలోచనా సరళి ....
ఆలోచనలలో దూరం వ్యత్యాసం ఉండటం వల్ల

మనసుది ఒక విచిత్ర స్థితి
ఎప్పుడైనా ఎవరినైనా కావాలనుకుంటే
దగ్గరయ్యేలా దగ్గరగా చూడగలదు .... ఆలోచనల్లో
స్పర్శించనూగలదు .... ఇతరుల మాటల్లో విని.

ఒకరిని మరొకరు తన అనుకునే దాపరికం
ఉంటుంది ప్రతి మది ఎదలో .... రహశ్యాల సొరుగు లో
మరొకర్ని హృదయం లోంచి వెలి వేసినా
ఆ మరొకరి హృదయం సొరుగు లో ఆ ఒకరి స్థానం పదిలమే ....

6 comments:

  1. మనస్సు మాయావి, మనిషిని తనకనుగుణంగా మార్చుకొని ఆడిస్తుంది.
    అభినందనలు సర్, బాగుంది మీ పొస్ట్.

    ReplyDelete
    Replies
    1. మనస్సు మాయావి, మనిషిని మాయ చేసి తన నిర్ణయాలకు అనుగుణంగా మార్చుకొని ఆడిస్తుంది.
      అభినందనలు సర్, బాగుంది మీ పొస్ట్.
      బాగుంది స్పందన స్నేహ ఆత్మీయ ప్రోత్సాహక అభినందన
      ధన్యాభివాదాలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

      Delete
  2. నిజంగానే" మనసుది ఒక విచిత్ర స్థితి " కావాలనుకుంటే దగ్గర చేస్తుంది,లేదంటే దూరం చేసుకుంటుంది. చంద్రగారు చాలా బాగా చెప్పారు మనసు గూర్చి.

    ReplyDelete
    Replies
    1. నిజంగానే "మనసుది ఒక విచిత్ర స్థితి" కావాలనుకుంటే దగ్గర చేస్తుంది, లేదంటే దూరం చేసుకుంటుంది.
      చంద్రగారు చాలా బాగా చెప్పారు మనసు గూర్చి.
      చాలా బాగుంది అభినందన స్పందన
      ధన్యవాదాలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!

      Delete
  3. ఎక్కడ బావుందో చెప్పడం చాలా కష్టం చంద్ర గారు మీ కవితలో ఎలా రాస్తారు అండి ఇంత సొంపైన భావాలు ..మీకు వందనాలు

    ReplyDelete
    Replies
    1. ఎక్కడ బావుందో చెప్పడం చాలా కష్టం చంద్ర గారు మీ కవితలో
      ఎలా రాస్తారు అండి ఇంత సొంపైన భావాలు ..
      మీకు వందనాలు
      మీకు ప్రత్యాభివందనములు మంజు గారు
      చక్కని అభినందన మీ స్పందన
      శుభసాయంత్రం!!

      Delete